E-Paper
Advertisement

Shiva 4K 1st Day Collections: ‘శివ’ రీ రిలీజ్.. ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే

Shiva 4K 1st Day Collections: ‘శివ’ రీ రిలీజ్.. ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే
Advertisement

Shiva 4K Re-Release First Day Collections: ఎన్నో అంచనాల మధ్య శివ మూవీ రీ రిలీజైంది. 36 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీ ట్రెండ్ సెటర్ గా నిలిచిన ఈ చిత్రం నిన్న నవంబర్ 14న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989లో విడుదలైన టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద దుమ్ముదులిపిన శివ అప్పట్లోనే రూ. 4 కోట్ల వరకు కలెక్షన్స్ చేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ని పూర్తిగా మార్చేసిన ఈ సినిమా రీ రిలీజ్ లోనూ దుమ్మురేపుతోంది.

రూ. 2 కోట్ల ఖర్చు

Advertisement

లేటెస్ట్ టెక్నాలజీలో డాల్బీ అట్మాస్, 4K టెక్నాలజీలో శివ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. అంతేకాదు ఆడియన్స్ కూడా సరికొత్త అనుభూతిని అందించేందుకు టాక్కాలజీ విషయం డైరెక్టర్ వర్మ కూడా ప్రత్యేక కేర్ తీసుకున్నాడట. ఈ సినిమా సౌండ్‌ నుంచి ప్రజెంటేషన్ వరకు కొత్తగా ప్రజెంట్ చేయడానికి కసరత్తు చేశాడట. డీఐ, ఇతర పనులన్నింటినీ దగ్గరుండి మరి పర్యవేక్షించాడట వర్మ. ఇందులో భాగంగా శివ రీ రిలీజ్ కు మూవీ టీం భారీగానే ఖర్చు చేసిందట. మూవీ 4K వెర్షన్ కోసం సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సినీ వర్గాలు నుంచి సమాచారం. 

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే

లేటెస్ట్ టెక్కాలజీ, కొత్త హంగులతో నిన్న మరోసారి థియేటర్లలోకి వచ్చిన శివ వసూళ్లు కూడా బాగానే రాబట్టినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సిస్ తో కలిసి మొత్తం రూ.86 లక్షలు వైరల్డ్ వైడ గ్రాస్ చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ డే మంచి ఒపెనింగ్ ఇచ్చిన శివ ఈ రోజు కూడా భారీగా కలెక్షన్స్ చేసేలా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ రోజు కూడా థియేటర్లలో హౌజ్ ఫుల్ కనిపిస్తోంది. వీకెండ్ కాబట్టి నిన్నటి కంటే ఈ రోజు వసూళ్లు మరింత పెరిగేలా అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక రేపు ఆదివారం కూడా కాబట్టి శివ రీ రిలీజ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోవడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.

Advertisement

Also Read: Nandamuri Balakrishna: అభిమానిపై బాలయ్య తాండవం… ముంబైకి వెళ్లినా.. ఏం మారలేదు

నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్

కాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం డైరెక్టర్ గా పరిచయం అవ్వడం విశేషం. యూత్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ మూవీ రూపురేఖలనే మార్చేసింది. సినీ పరిశ్రమకు కొత్త జానర్ పరిచయం చేసి సంచలనంగా మారాడు వర్మ. అంతేకాదు అప్పట్లోనే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ తన మార్క్ చాటుకున్నాడు ఆర్జీవీ. ఈ చిత్రంతో నాగార్జున కెరీర్ కూడా మలుపు తిరిగింది. అప్పటి వరకు లవ్ స్టోరీలకే పరితమైన ఈ మన్మధుడిలో మాస్,యాక్షన్ కూడా ఉందని రుజువు చేసిన చిత్రమిది. ఇప్పటికీ నాగార్జున కెరీర్ శివ ఒక మైల్ స్టోన్ అనడం లో సందేహం లేదు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో నాగార్జున అన్న వెంకట్ అక్కినేని, సురేందర్ లు సంయుక్తంగా నిర్మించారు. కేవలం రూ. కోటీ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 4 కోట్లకు పైగా కలెక్షన్స్ చేయడం విశేషం.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×