E-Paper
Advertisement

Sprouted Potatoes: మొలకెత్తిన దుంపలు తింటున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

Sprouted Potatoes: మొలకెత్తిన దుంపలు తింటున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
Advertisement

Sprouted Potatoes: దాదాపు అందరి వంటింట్లోనూ ఎక్కువగా కనిపించే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. చాలామంది దీన్ని ఇతర కూరగాయలతో కలిపి తినడానికి ఇష్టపడతారు. అందుకే.. ఆలుగడ్డను ‘కూరగాయల రాజు’ అని పిలుస్తారు. ఈ దుంపల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఆలుగడ్డ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. మొలకెత్తిన దుంపలను తింటే మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మొలకెత్తిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం? ఎందుకు తినకూడదు.. వంటి వివరాలు తెలుసుకుందాం.

మొలకెత్తినవి ఎందుకు ప్రమాదం?

మొలకెత్తిన ఆలుగడ్డల్లో సోలనిన్, చాకోనిన్ అనే రెండు గ్లైకో ఆల్కలాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ఈ రెండు సమ్మేళనాలు అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే.. గ్లైకో ఆల్కలాయిడ్స్ అధికంగా తీసుకుంటే.. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలనొప్పి, జ్వరం, తక్కువ రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఎందుకు తినకూడదంటే?

Advertisement

మొలకెత్తిన బంగాళదుంపల్లో ఉండే గ్లైకో ఆల్కలాయిడ్స్ విషపూరితమైనవి. ఇవి జీర్ణాశయాంతర, నాడీ వ్యవస్థ రుగ్మతలకు కారణమవుతాయి. దీనివల్ల వికారం, తలనొప్పి, కడుపు తిమ్మిరి, విరోచనాలు, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. మొలకెత్తిన దుంపల్లో గ్లైకో ఆల్కలాయిడ్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల దుంపలు చేదుగా ఉంటాయి. కాబట్టి.. వీటిని తినడం పోవడమే ఉత్తమం.

హెచ్చరిస్తున్న నిపుణులు:

మొలకెత్తిన బంగాళదుంపలను తింటే.. ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి.. మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన ఆలుగడ్డలను తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మొలకెత్తిన బంగాళదుంపల నష్టాలను తగ్గించాలనుకుంటే.. వాటిని అవసరానికి మించి కొనకపోవడం ఉత్తమం. కాబట్టి.. ఒకటి లేదా రెండు వారాల పాటు ఉండే బంగాళదుంపలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ దుంపలు త్వరగా మొలకెత్తకుండా ఉండాలంటే.. చల్లని లేదా చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×