E-Paper
Advertisement

Nandamuri Balakrishna: అభిమానిపై బాలయ్య తాండవం… ముంబైకి వెళ్లినా.. ఏం మారలేదు

Nandamuri Balakrishna: అభిమానిపై బాలయ్య తాండవం… ముంబైకి వెళ్లినా.. ఏం మారలేదు
Advertisement

Advertisement

Balakrishna Fires on Fan:“ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది. పడుకునే బెడ్ మారుతుంది. కానీ, బ్లడ్ ఎలా మారుతుంది రా బ్లడీ ఫూల్” అనే బాలయ్య డైలాగ్ గుర్తుందా… ఇప్పుడు ఈ డైలాగ్‌ను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడేందుకు ఆ డైలాగ్ గుర్తొచ్చిందా అని ఆలోచిస్తున్నారు. అసలేం జరిగిందో చూద్దాం రండి. గాడ్ ఆఫ్ మాసెస్, మా బాలయ్య బాబు అంటూ అభిమానులు ఆయనను పిలుచుకుంటారు.

అదే సీన్ రిపీట్

అలాగే స్టేజ్ పై కూడా మీ ప్రేమ లేకపోతే మేము లేమంటూ చెప్పే బాలయ్య వారిపై ఆగ్రహం చూపించిన సంఘటలు కూడా ఎన్నో ఉన్నాయి. అభిమానుంతో ఎవరైనా ఆయన దగ్గరి వెళితే విశ్వరూపం చూడాల్సిందే. అది పొలిటికల్ మిటింగ్ అయినా, సినిమా ఈవెంట్ అయినా. అభిమానంతో సెల్ఫీ కోసం వెళ్లిన వారు ఆయనతో చీవాట్లు పడిన సంఘటనలు కోకల్లలు. ఏకంగా ఓ అభిమాని అయితే చెంపదెబ్బ కూడా తిన్నాడు. లెజెండ్ మూవీ టైంలో మూవీ సెట్ లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. అయినా ఇలాంటి సంఘటను ఎన్ని ఎదురైన బాలయ్య క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయన కనిపిస్తే చాలు ఫోటో దిగాలనే కులుహులం చూపిస్తున్నారు.

ప్లేస్ మారిన మారని బాలయ్య

Advertisement

తాజాగా కూడా ఓ అభిమాని ఆసక్తితో సెల్ఫీ అడిగితే అదే సీన్ రిపీట్ అయ్యింది. ప్లేస్ మారిన బాలయ్య తీరు మారలేదు. ముంబై వెళ్లిన అభిమానులకు చేదు అనుభవం తప్పలేదు. కాగా అఖండ 2 తాండవం సాంగ్ ఈవెంట్ సెల్ఫీ అడిగిన అభిమానిని స్టేజ్ పైనే ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 మూవీతో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసింది మూవీ టీం. మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వేడుకను ముంబైలో గ్రాండ్ నిర్వహించారు. ముంబై బాంద్రాలోని పీవీఆర్ లో అఖండ 2 ఫస్ట్ సింగిల్ తాండవం లిరికల్ సాంగ్ ను లాంచ్ చేశారు.

Also Read: Actress Sudeepa: కొడుకుని పరిచయం చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్‘ చైల్డ్ ఆర్టిస్ట్ పింకి

అభిమానిపై ఆగ్రహం

ఈ కార్యక్రమంలో బాలయ్య, బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు పలువురు హాజరయ్యారు. సాంగ్ లాంచ్ అనంతరం అభిమానులు బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించాడు. అదే జోష్ లో స్టేజ్ పైకి వెళ్లి ఆయనను సెల్ఫీ అడగ్గా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్ అంత ఒక్కసారిగా సెల్ఫీ కోసం ఎగబడటంతో బాలయ్య సహనం కోల్పోయాడు. అలా మీద పడతారేంటి? అంటూ అభిమానులపై ఫైర్ అయ్యాడు. దీంతో ఇది కాస్తా వైరల్ అవ్వడంతో బాలయ్య తీరుపై నెటిజన్స్ చర్చించుకున్నారు. ప్లేస్ మారిన బాలయ్య తీరు మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లెజెండ్ సినిమాలో ఆయన చెప్పిన పై డైలాగ్ న గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడైన సింహం సింహమే అంటూ అభిమానులు మాత్రం బాలయ్య మ్యానరిజం గురించి చెప్పుకుంటు మురిసిపోతున్నారు.

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×