E-Paper
Advertisement

Nagarjuna: బిగ్ బాస్ 10 కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్.. ఎంత తీసుకుంటున్నారంటే..!

Nagarjuna: బిగ్ బాస్ 10 కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్.. ఎంత తీసుకుంటున్నారంటే..!
Advertisement

Nagarjuna: తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోలకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా బిగ్‌బాస్ తెలుగు షోకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. దాదాపు మూడో సీజన్ నుంచి ఈ షోని నాగార్జుననే నడుపుతున్నారు. ఈ షోను హోస్ట్‌గా ముందుకు.. నడిపిస్తున్న నాగార్జున అక్కినేని షోకు మరో స్థాయి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఆయన మాటల తీరు, కంటెస్టెంట్లతో వ్యవహరించే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఇప్పటివరకు బిగ్‌బాస్ తెలుగు మొత్తం తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. తొలి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌ను నాని నిర్వహించారు. ఆ తర్వాత నుంచి వరుసగా ఏడు సీజన్లకు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ప్రతి సీజన్‌కు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూనే ఉంది. తాజాగా ముగిసిన తొమ్మిదో సీజన్ కూడా మంచి రేటింగ్స్‌తో ముగిసినట్లు సమాచారం.

Advertisement

ఇప్పుడు అందరి దృష్టి బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌పై ఉంది. ఈ సీజన్ కోసం నాగార్జున భారీ పారితోషికం డిమాండ్ చేశారనే వార్తలు సోషల్ మీడియా, సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వస్తున్న కథనాల ప్రకారం, ఈసారి ఆయనకు దాదాపు 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

ఈ షోను నిర్మిస్తున్న ఎండెమాల్ షైన్ ఇండియా నాగార్జున డిమాండ్‌కు ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున హోస్ట్‌గా ఉన్నప్పుడే షోకు ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయనే నమ్మకంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

Advertisement

నాగార్జున అక్కినేని కెరీర్ విషయానికి వస్తే, ఆయన గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. హీరోగా మాత్రమే కాకుండా, కీలక పాత్రల్లో కూడా ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి షోలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బిగ్‌బాస్ షో ద్వారా ఆయనకు వచ్చిన క్రేజ్ మరే షోతోనూ రాలేదని అభిమానులు అంటున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందని అంచనా. నాగార్జున హోస్టింగ్‌తో ఈ సీజన్ కూడా మరింత ఆసక్తికరంగా మారుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ALSO READ: Prabhas: ‘కపుల్ ఫ్రెండ్లీ’కి ప్రభాస్ సపోర్ట్.. ఎస్‌కెఎన్ రియాక్షన్ చూశారా?

Related News

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Big Stories

Advertisement
×