E-Paper
Advertisement

Mysuru Suicide: భర్త విదేశీ ట్రిప్‌కు తీసుకెళ్లలేదని.. ఆత్మహత్య చేసుకున్న భార్య

Mysuru Suicide: భర్త విదేశీ ట్రిప్‌కు తీసుకెళ్లలేదని.. ఆత్మహత్య చేసుకున్న భార్య
Advertisement

Mysuru Suicide: కర్ణాటకలోని మైసూరులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు తీసుకెళ్లడానికి భర్త నిరాకరించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర మనస్థాపంతో సంధ్య (46) ప్రాణాలు తీసుకుంది. అయితే ఆమె మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని బెంగళూరు చెందిన సంధ్య.. చామరాజనగర్ కు చెందిన రంగనాథ్ ను 25 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు కౌశిక్, కుమార్తె సృష్టి ఉన్నారు. సృష్టి ప్రస్తుతం విదేశాల్లో చదువుతుండగా.. కౌశిక్ తల్లిదండ్రులతో కలిసి మైసూర్ లోనే ఉంటున్నాడు. గత బుధవారం రాత్రి విదేశీ ట్రిప్ నకు సంబంధించి భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కూతురు దగ్గరకు వెళ్లే విషయమై.. ఇరువురు వాదించుకున్నట్లు సమాచారం. దీంతో రంగనాథ్ ఆవేశంగా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సంధ్య తన గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది.

నా తల్లిది హత్య: కూతురు

Advertisement

తన తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కూతురు సృష్టి తీవ్రంగా ఖండించింది. తన తల్లి తనకు తానుగా చనిపోలేదని ఆమెను హత్య చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన తండ్రి, సోదరుడు వేధించారని.. వారిద్దరే తన తల్లి మరణానికి కారణమని ఆరోపించారు. తన తల్లి ప్రాణాలను బలిగొన్న వారిని కఠినంగా శిక్షించాలని సృష్టి డిమాండ్ చేశారు.

‘నా సోదరి అబద్దం చెబుతోంది’

మరోవైపు కుమారుడు కౌశిక్ (17) మాత్రం తన తండ్రికి సపోర్ట్ చేస్తున్నాడు. తనకు పరీక్షలు ఉన్నందున.. ఇప్పుడు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని తండ్రి చెప్పినట్లు పేర్కొన్నారు. తన సోదరి చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దాలని కొట్టి పారేశాడు. తన తల్లి చనిపోవడం చూసిన మెుదటి వ్యక్తిని తానే అని.. ఆమె మరణవార్త తెలిసిన తర్వాతే తన తండ్రి ఇంటికి వచ్చారని కౌశిక్ స్పష్టం చేశాడు.

Advertisement

Also Read: Harish Rao: ఓవైపు యూరియా కష్టాలు.. మరోవైపు జల వివాదాలు.. హరీశ్ రావు ప్రశ్నల వర్షం

భర్త రియాక్షన్ ఇదే..

మరోవైపు భార్య మరణంపై భర్త రంగనాథ్ స్పందించారు. తానే చంపానంటూ కూతురు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తన భార్య అంటే తనకు ఎంతో ప్రేమ అని, 90 శాతం ఆస్తి ఆమె పేరునే ఉందని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఈ నిజాన్ని బయటపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సంధ్య సోదరుడు గురుమూర్తి ఫిర్యాదు ఆధారంగా సరస్వతిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Summer 2026 ACs Offers: టాప్ కంపెనీల ఏసీలపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఈ ఛాన్స్ వదులుకోకండి!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×