E-Paper
Advertisement

నాగవంశీపై ఏషియన్ సునీల్ బాడీ షేమింగ్ కామెంట్స్.. నెట్టింట తీవ్ర వ్యతిరేకత!

నాగవంశీపై ఏషియన్ సునీల్ బాడీ షేమింగ్ కామెంట్స్.. నెట్టింట తీవ్ర వ్యతిరేకత!
Advertisement

Tollywood Controversy: టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న ‘థియేటర్ రెంటల్స్’ వివాదం ఇప్పుడు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ (ఏషియన్ సునీల్).. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీని ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిజినెస్ క్లాష్‌లో భాగంగా నాగవంశీని బాడీ షేమింగ్ చేస్తూ సునీల్ నారంగ్ మాట్లాడటంపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also-Podarillu Sailaja : ‘పొదరిల్లు’ సీరియల్ నుంచి శైలజ అవుట్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?

వివాదం ఎక్కడ మొదలైంది?

Advertisement

గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో థియేటర్ల అద్దెలు, పర్సంటేజ్ సిస్టమ్ విర్చువల్ ప్రింట్ ఫీజ్ (VPF) చార్జీల విషయంలో నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎగ్జిబిటర్ల తీరు వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని, థియేటర్ల మోనోపోలీ నడుస్తోందని నిర్మాతల మండలి తరపున నాగవంశీ గట్టిగా అవాజ్ లేపారు. ఓపెన్‌గా థియేటర్ల యాజమాన్యాల సిస్టమ్‌ను ఆయన తప్పుబట్టారు. అదే సందర్భంలో ఒక పెద్ద ఎగ్జిబిటర్ స్థలాలు దొరికిన చోటల్లా మల్టీపెక్సులు నర్మించేస్తున్నారని అలాంటి వ్యక్తి సింగిల్ థియేటర్ల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఏషియన్ సునీల్ కామెంట్స్

నాగవంశీ లేవనెత్తిన వ్యాపారపరమైన ప్రశ్నలకు లాజికల్‌గా సమాధానం చెప్పాల్సిన సునీల్ నారంగ్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఊహించని విధంగా వ్యక్తిగత విమర్శలకు దిగారు. నాగవంశీ శారీరక రూపాన్ని, ఆయన వేసుకునే విగ్, వాడే బ్లాక్ గాగుల్స్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా, అవహేళన చేస్తూ మాట్లాడారు. సమస్యను వదిలేసి, ఒకరి వ్యక్తిగత రూపాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Advertisement

Read also-Gundeninda GudiGantalu Today episode: రోహిణిని అవమానించిన ప్రభావతి.. కామాక్షికి నిజం తెలుస్తుందా..? ప్రభావతికి షాక్..

నెట్టింట సునీల్ నారంగ్‌పై ట్రోలింగ్.. నాగవంశీకి సపోర్ట్

సునీల్ నారంగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ‘బిజినెస్ పరంగా విభేదాలు ఉంటే ఆఫీసుల్లో కూర్చోని మాట్లాడుకోవాలి లేదా ప్రొఫెషనల్‌గా కౌంటర్ ఇవ్వాలి. అంతే తప్ప ఇలా ఒకరి లుక్స్‌ని ఎగతాళి చేయడం ఏంటి?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంత పెద్ద పొజిషన్‌లో ఉండి, బాడీ షేమింగ్‌ను ప్రోత్సహించేలా మాట్లాడటం సునీల్ నారంగ్ సంస్కారానికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. మరోవైపు, సమస్యలపై గళం విప్పినందుకు నాగవంశీని ఇలా పర్సనల్‌గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ సినిమా ప్రియులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. వ్యాపారాలు, లాభనష్టాల గొడవలు ఏ ఇండస్ట్రీలో అయినా సహజం. కానీ, టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర వ్యక్తుల మధ్య చర్చలు ఇంత దిగజారి, బాడీ షేమింగ్ స్థాయికి వెళ్లడం పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వివాదంపై నాగవంశీ ఎలా స్పందిస్తారో.. ఇండస్ట్రీ పెద్దలు దీనికి ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి మరి.

Related News

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

Big Stories

Advertisement
×