E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయిన అమర్

Nindu Noorella Saavasam Serial Today Episode May 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బయటకు వాకింగ్‌కు వెళ్లిన అమర్‌ ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో టెన్షన్‌ పడుతూ రాథోడ్ కారేసుకుని వెళ్తాడు. పిల్లలు కంగారు పడుతుంటారు. రోడ్డు గుర్తు లేక ఎక్కడ తిరుగుతున్నాడో అంటూ కంగారు పడుతుంటారు. మరోవైపు మిలటరీ మేజర్‌కు టెర్రరిస్టులు తప్పించుకున్నారని ఇన్ఫర్మేషన్‌ వస్తుంది. దీంతో మేజర్‌ రాథోడ్‌కు కాల్ చేస్తాడు. అమరేంద్రకు ఇప్పుడు ఎలా ఉంది రాథోడ్‌ అని అడగ్గానే.. రాథోడ్‌ బాధగా సారుకు ఏమీ గుర్తుకు రావడం లేదు సార్‌ అంతా మర్చిపోయారు అని చెప్పగానే.. అమర్‌కు ఇలా జరగడం బ్యాడ్‌లక్‌. ఇంకో బ్యాడ్‌ న్యూస్‌ ఏంటంటే అమర్‌ కష్టపడి పట్టుకున్న మిలిటెంట్స్‌ జైళ్లోంచి తప్పించుకుని పారిపోయారు. అని చెప్పగానే.. రాథోడ్‌ షాక్‌ అవుతాడు.

రాథోడ్‌ ఫోన్‌ మాట్లాడుతుంటే.. కారు పక్క నుంచే అమర్‌ వెళ్తుంటాడు. రాథోడ్‌ గమనించడు. కానీ షాకింగ్‌ గా  ఏమంటున్నారు సార్ అనగానే.. మేజర్‌ వాళ్లు అమర్‌ మీద చాలా కోపంగా ఉన్నారు రాథోడ్‌. ఏ క్షణమైనా అమర్‌ మీద తన ఫ్యామిలీ మీద అటాక్‌ చేయోచ్చు. నువ్వు అమర్‌ దగ్గరే ఉండు అని చెప్పగానే.. రాథోడ్‌ బాధగా సారీ సార్‌ మార్నింగ్‌ నుంచి అమర్‌ సార్‌ కనిపించడం లేదు అని చెప్పగానే.. మేజర్‌ షాక్‌ అవుతాడు. అమర్‌ మిస్‌ అయ్యాడా..? అని అడగ్గానే.. రాథోడ్‌ అవును సార్‌ ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. సార్‌ జాగింగ్ కు వెళ్లాడు ఇప్పటి వరకు రాలేదు. సార్‌ కోసం వెతుకుతున్నాను. అని చెప్పగానే..

Advertisement

మేజర్‌ షాకింగ్‌ గా గతం మర్చిపోయిన అమర్‌ ఎక్కడికి వెళ్లినట్టు.. అన్ని ఇప్పుడే జరగాలా..? అనగానే.. రాథోడ్‌ డోంట్‌ వర్రీ సార్‌ అమర్‌ సార్‌ ఎక్కడ ఉన్నా నేను వెతికి సేఫ్‌గా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పగానే.. మేజర్ నేను మన బెటాలియన్‌ ను పంపించి అమర్‌ను వెతికిస్తాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్లు రాథోడ్‌. ఇంటికి కూడా ఫోర్స్‌ను పంపిస్తాను. అమర్‌ ఫ్యామిలీకి ఏమీ కాకుండా చూసుకో.. అని చెప్పగానే.. రాథోడ్‌ ఎస్‌ సార్‌ నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు మన ఫోర్స్‌ను పంపించి అమర్‌ సార్‌ను త్వరగా వెతికి పట్టుకోండి సార్‌ అనగానే.. మేజర్‌ ఓకే నువ్వు ఇంటికి వెళ్లు అని కాల్ కట్‌ చేస్తాడు.

మరోవైపు జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాదుల ఒక ఇంట్లోకి వెళ్తారు. అక్కడ రెడీగా ఉన్న ఒక రౌడీ రండి బాస్‌ మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. అందుకు కావాల్సని ఏర్పాట్లు చేశాను. మీరు త్వరగా రెడీ అయితే బోర్డర్‌ దాటేయోచ్చు అని చెప్పగానే. తీవ్రవాది దానికి ముందు నేను ఒక పని చేయాలి అంటాడు. ఏంటా పని రౌడీ అడగ్గానే.. తీవ్రవాది కోపంగా చూస్తూ.. మమ్మల్ని కొట్టి జైళ్లో పెట్టించిన అమరేంద్ర అంతు చూడాలి. వాడి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలి అంటాడు. రౌడీ భయంగా వద్దు బాస్‌ అది చాలా రిస్క్‌ ఇప్పుడు అమరేంద్రను టచ్‌ చేయోద్దు అనగానే.. తీవ్రవాది వాడికి బుద్ది చెప్పకుండా వెళ్లేది లేదు అనగానే.. రౌడీ నా మాట వినండి బాస్‌ ఇప్పటికే మీ కోసం పోలీసులు అర్మీ వాళ్లు వెతుకుతున్నారు. అమరేంద్ర ఇంటి దగ్గర ఆర్మీ వాళ్లు కాపలా కాస్తుంటారు. మీరు దొరికారంటే ఎన్‌కౌంటర్‌ చేయడమో..? ఉరి తీయటమో చేస్తారు. మిమ్మల్ని సేఫ్‌గా బోర్డర్‌ దాటించడమే నా బాధ్యత అని చెప్తుండగానే..

Advertisement

తీవ్రవాది కత్తి తీసుకుని కోపంగా రౌడీ చేయి కోస్తాడు. దీంతో రౌడీ ఏం చేస్తున్నారు బాస్‌ అనగానే.. తీవ్రవాది ఏం నొప్పిగా ఉందా..? ఆ అమరేంద్ర మమ్మల్ని ఇంతకంటే వెయ్యిరెట్లు ఎక్కువగా బాధించాడు. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని వాడికి పదింతలు నరకం చూపించాలి. నా కళ్ల ముందే ఆ అమరేంద్ర మన వాళ్లను పిచ్చి కుక్కలను కాల్చినట్టు కాల్చేశాడు. అందుకే వాడి కళ్ల ముందే వాడి ఫ్యామిలీని కాల్చి చంపాలి. మనం వాణ్ని టచ్‌ చేయడం రిస్క్‌ కాదు. మనల్ని వాడు టచ్‌ చేయడం రిస్క్‌ అని వాడు ఫీల్‌ అవ్వాలి. మన జోలికి రావాలంటే పోలీసులు ఆర్మీ మాత్రమే కాదు దేశం మొత్తం భయపడాలి. వాణ్ని వాడి ఫ్యామిలీని చంపి ఈ దేశాన్ని భయపెట్టి అప్పుడు మన దేశానికి వెళ్తాను అని చెప్పగానే..

రౌడీ మాత్రం భయపడుతూ ఈ పాటికే ఆర్మీ వాళ్లు అమరేంద్ర ఫ్యామిలీని సెక్యూర్‌ చేసి ఉంటారు. ఇంక అమరేంద్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆలాంటి వాణ్ని ఎలా పట్టుకుంటారు అని చెప్తుండగానే అమర్‌ ఇల్లు మర్చిపోయి ఈ రౌడీ తీవ్రవాదులు ఉన్న ఇంట్లోకి వస్తాడు. అమర్‌ను చూసి అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×