Tejaswini Dance:నందమూరి మోక్షజ్ఞ ..ఈయన గారు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు.ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటూ బాలయ్య ఊరిస్తున్నాడే తప్ప అసలు విషయం ఇంకా తేల్చట్లేదు.అయితే డీలా పడ్డ ఫ్యాన్స్ కి మాంచి సర్ ప్రైజ్ వీడియో వదిలింది అక్క నందమూరి తేజస్విని.
యస్ …బాలకృష్ణ చిన్న కుమార్తె అయిన తేజస్విని ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి చేసిన ఒక క్రేజీ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మాంచి సాంగ్ బీట్‌కు అనుగుణంగా ఆమె వేసిన స్టెప్స్, టైమింగ్, డ్యాన్స్‌లో చూపించిన గ్రేస్ చూసి ముక్కున వేలేసుకుంటుంది టాలీవుడ్.
Nandamuri Balakrishna's second daughter, Visakha MP Shri Bharat's wife Tejaswini, has captivated everyone with her dance.❤️🔥🔥🔥#TejaswiniNandamuri #NandamuriTejaswini #Tejaswini #NandamuriBalakrishna #BalakrishnaDaughter #Balakrishna #Telugucinema #Tollywood… pic.twitter.com/dG3QRccLpQ
— BIG TV Cinema (@BigtvCinema) May 30, 2026
ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నట్టుగా,ఎంతో న్యాచురల్ గా తేజస్విని వేసిన డాన్స్ మూవ్‌మెంట్స్ చూస్తుంటే, బాలయ్య బాబులోని మాస్ ఎనర్జీ ఆమెలోనూ పుష్కలంగా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నటసింహం ఫ్యాన్స్.మాములుగా నటనకి దూరంగా బిజినెస్, ప్రొడక్షన్ రంగాలకే పరిమితం అవుతుంది అనుకున్న వారికి, ఈ డాన్స్ వీడియో తనలోని సరికొత్త కోణాన్ని పరిచయం చేసిందనే చెప్పాలి.
‘అన్‌స్టాపబుల్’ టాక్ షో క్రియేటివ్ టీమ్‌లో కీలక పాత్ర
తేజస్విని గతంలో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి సంచలన విజయం సాధించిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో క్రియేటివ్ టీమ్‌లో కీలక పాత్ర పోషించారు. ఆ షో అంత పెద్ద సక్సెస్ కావడంలో ఆమె తెరవెనుక పడిన శ్రమ ఎంతో ఉంది. అంతేకాకుండా, బాలకృష్ణ గత చిత్రాలైన ‘అఖండ2 ’ వంటి సినిమాల నిర్మాణ వ్యవహారాల్లోనూ, ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల మేనేజ్‌మెంట్‌లోనూ ఆమె చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తెర ముందు కనిపించడానికి పెద్దగా ఆసక్తి చూపించని ఆమె, కేవలం ప్రొడక్షన్ బాధ్యతలకే పరిమితం అవుతారని అంతా భావించారు. కానీ, తాజాగా భాను మాస్టర్‌తో కలిసి చేసిన ఈ రీల్ వైరల్ అవ్వడంతో, నందమూరి ఆడపడుచులోనూ ఈ స్థాయి స్టార్ మెటీరియల్ ఉందా అని అందరూ డిబేట్లు పెట్టేస్తున్నారంతా .ఇక ఈ డాన్స్ ఇలా వచ్చిందో లేదో అప్పుడే నెట్టింట్లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది కూడా.
సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ప్లాన్ ఏమైనా చేస్తుందా
ముఖ్యంగా సాంగ్ బీట్‌కు తగ్గట్టుగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, స్టైలిష్ లుక్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఒకవైపు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్స్ కోసం వెతుకుతున్న ఫ్యాన్స్‌కు, తేజస్విని డాన్స్ వీడియో ఒక ట్రీట్‌లా దొరికిందనే చెప్పాలి.
వెండితెరపై బాలయ్య మాస్ స్టెప్పులను గుర్తుకు తెచ్చేలా తేజస్విని చేసిన ఈ డాన్స్ విన్యాసం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.చూడాలి మరి తేజు తన టాలెంట్ ని కేవలం డాన్స్ వీడియోలకి పరిమితం చేస్తుందా ?లేక సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ప్లాన్ ఏమైనా చేస్తుందా !
also read :బతికున్నప్పుడు గురువుగారు.. లేనప్పుడు పట్టించుకోరా? దాసరి వారసులు, శిష్యులపై అభిమానుల ఫైర్