Best washing machine for 1 BHK: చిన్న ఫ్యామిలీలు, బ్యాచిలర్స్ లేదా సిటీల్లో 1 BHK అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి ఇల్లు సర్దుకోవడం ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా బట్టలు ఉతుక్కోవడానికి పెద్ద సైజు వాషింగ్ మెషీన్ కొంటే గదిలో స్థలం మొత్తం దాంతోనే నిండిపోతుంది. ఇలాంటి చిన్న ఇళ్లకు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ.. బట్టలను పర్ఫెక్ట్‌గా క్లీన్ చేసే ‘చిన్న సైజు వాషింగ్ మెషీన్లు’చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి తక్కువ నీరు, కరెంట్‌ను వాడుకుంటూనే అద్భుతంగా పనిచేస్తాయి. 1 BHK ఇళ్లకు సరిపోయే టాప్ 5 చిన్న వాషింగ్ మెషీన్ల వివరాలు మీకోసం..
1 BHK అపార్ట్‌మెంట్ల కోసం 5 బెస్ట్ చిన్న సైజు వాషింగ్ మెషీన్లు:
తక్కువ స్థలంలో ఇమిడిపోతూ, ఎక్కువ రేటింగ్ పొందిన టాప్ 5 స్మాల్ వాషింగ్ మెషీన్ల ఫీచర్లు, ఖచ్చితమైన ధరలు..
1. ఎల్‌జీ 6 కేజీ ఇన్వర్టర్ ఫుల్లీ ఆటోమేటిక్ (LG 6 Kg 5 Star Inverter Fully Automatic Front Load):
1 BHK ఫ్లాట్లలో ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఎల్‌జీ 6 కేజీ ఫ్రంట్ లోడ్ మెషీన్ చాలా బెస్ట్ ఆప్షన్. ఇది సైజులో చిన్నగా ఉండి, కిచెన్ ప్లాట్‌ఫామ్ కింద లేదా బాల్కనీలో ఈజీగా సరిపోతుంది. దీనిలోని ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ వల్ల మెషీన్ అస్సలు శబ్దం చేయదు. అపార్ట్‌మెంట్లలో పక్కవారికి డిస్టర్బెన్స్ లేకుండా రాత్రి పూట కూడా బట్టలు ఉతుక్కోవచ్చు. స్మార్ట్ డయాగ్నోసిస్, హెల్తీ స్టీమ్ వాష్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.23,990.
2. శామ్‌సంగ్ 6 కేజీ ఇన్వర్టర్ టాప్ లోడ్ (Samsung 6 Kg Inverter Fully Automatic Top Load):
తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్ కావాలనుకుంటే శామ్‌సంగ్ 6 కేజీ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలోని ‘ఎకో బబుల్’ సాంకేతికత డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల మురికిని వేగంగా వదిలిస్తుంది. దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. దీని డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ వల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది. ధర రూ. 14,490.
3. వర్ల్‌పూల్ 6 కేజీ వైట్‌మేజిక్ రాయల్ (Whirlpool 6 Kg Whitemagic Royal High):
వర్ల్‌పూల్ సంస్థ నుంచి వస్తున్న ఈ టాప్ లోడ్ మెషీన్ చిన్న ఇళ్ల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. దీని వెడల్పు చాలా తక్కువగా ఉండటం వల్ల బాత్‌రూమ్ మూలలో కూడా పెట్టేయవచ్చు. హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బట్టలను తెల్లగా ఉతికేలా ‘హార్డ్ వాటర్ వాష్’ ఫీచర్‌తో వస్తుంది. పవర్ కట్ అయినప్పుడు ఇది ఆగిన చోటు నుంచే మళ్లీ వాషింగ్ స్టార్ట్ చేస్తుంది. దీని ధర రూ. 13,740 మాత్రమే.
4. గోద్రెజ్ 6.5 కేజీ 5 స్టార్ టాప్ లోడ్ (Godrej 6.5 Kg Fully Automatic Top Load):
బడ్జెట్ ధరలో కొంచెం ఎక్కువ కెపాసిటీ, ఐదు నక్షత్రాల (5 Star) కరెంట్ పొదుపు రేటింగ్ కావాలనుకునే వారికి గోద్రెజ్ బెస్ట్ ఆప్షన్. దీని టర్బో డ్రమ్ టక్నాలజీ బట్టలు ఒకదానికొకటి ముడిపడిపోకుండా క్లీన్ చేస్తుంది. దీని బాడీ తుప్పు పట్టని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వస్తుంది. ఇందులో చిన్న పిల్లల కోసం చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఉంది.దీని ధర రూ. 12,490
Also Read: బడ్జెట్‌లోనే బుల్లి ఫ్యాన్లు.. రూ.1000 లోపు టాప్ 5 మోడల్స్ ఇవే!
5. పానాసోనిక్ 6 కేజీ సెమీ ఆటోమేటిక్ (Panasonic 6 Kg 5 Star Semi-Automatic):
మీకు బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, మెషీన్‌ను ఇష్టమొచ్చిన చోటికి మార్చుకోవాలి అనుకుంటే.. పానాసోనిక్ సెమీ ఆటోమేటిక్ మెషీన్ చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల బ్యాచిలర్స్ ఒక రూమ్ నుంచి మరో రూమ్‌కు ఈజీగా మార్చుకోవచ్చు. ఇది చాలా తక్కువ నీటితో బట్టలను వేగంగా క్లీన్ చేస్తుంది. దీని డ్రైయర్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దీని ధర. 8,490 మాత్రమే.
1 BHK అపార్ట్‌మెంట్లలో స్థలం విలువ చాలా ఎక్కువ. అందుకే పెద్ద పెద్ద మెషీన్లు కొని ఇల్లు మొత్తం నింపేసే కంటే.. పైన పేర్కొన్న 6 కేజీ కెపాసిటీ ఉన్న చిన్న సైజు వాషింగ్ మెషీన్లు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉండి నిశ్శబ్దంగా పని చేయాలనుకుంటే.. ఎల్‌జీ ఫ్రంట్ లోడ్, లేదా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు కావాలనుకుంటే శామ్‌సంగ్ లేదా వర్ల్‌పూల్ టాప్ లోడ్ మోడల్స్‌ను ఎంచుకోవచ్చు.