E-Paper
Advertisement

బతికున్నప్పుడు గురువుగారు.. లేనప్పుడు పట్టించుకోరా? దాసరి వారసులు, శిష్యులపై అభిమానుల ఫైర్

బతికున్నప్పుడు గురువుగారు.. లేనప్పుడు పట్టించుకోరా? దాసరి వారసులు, శిష్యులపై అభిమానుల ఫైర్
Advertisement

Dasari Memorial:  ఆయన తీయని సినిమా లేదు, ఆయన టచ్ చేయని జానర్ లేదు..అలా ఒకటి కాదు రెండు కాదు మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 150 పై చిలుకు సినిమాలకి దర్శకత్వం వహించిన దర్శక రత్న.సినీ రంగానికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా నిలిచిన గొప్ప మనిషి.

బిగ్ టీవీలో విపరీతంగా వైరల్

Advertisement

అలాంటి దాసరి మే 30, 2017న మనకి దూరం అయ్యారు. ఇక మొయినాబాద్‌లోని ఆయన తోటలో భార్య పద్మ అంత్యక్రియలు జరిగిన చోటే దాసరి అంత్యక్రియలు జరిగాయి.అయితే అక్కడ నిర్మించిన స్మారక స్థలం (మెమోరియల్) ఇపుడు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉంది. ఇక ఈ వీడియోలు బిగ్ టీవీలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాసరి వంటి మహనీయుడికి టాలీవుడ్ ఇచ్చే గౌరవం ఇదేనా అని విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో మనోజ్ తో పాటు, మరికొంత మంది వచ్చి స్మారకాన్ని శుభ్రం చేసే పనిలో పడ్డారు.

Advertisement

also read :అరడజను సినిమాలు.. అంతంతమాత్రం బజ్.. ఆ సినిమా అయినా వర్కవుట్ అవుతుందా?

వారంతా ఏమై పోయారు?

కాని దర్శకుడిగానే కాకుండా తెలుగు తెరకు ఎందరో నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత ఆయనది. నటుడిగా మోహన్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన గురువు ఆయనే. అలాగే ఆర్ నారాయణమూర్తి, మురళీమోహన్, సుహాసిని, జయసుధ లాంటి ఎందరో నటీనటుల సినీ ప్రస్థానంలో దాసరి పాత్ర మరువలేనిది. అలా ఎందరో అనాథలకు, కొత్త ముఖాలకు లైఫ్ ఇచ్చి స్టార్స్‌గా మార్చిన వారంతా ఏమై పోయారు?

నివాళులు అర్పించాలనే స్పృహ కూడా లేదా?

బతికున్నప్పుడు చుట్టూ చేరిన భజన బృందం, శిష్యగణం.. ఇప్పుడు ఎక్కడికి పోయారు ? ఆస్తుల కోసం కొట్టుకుంటున్న ఆయన ఇద్దరు కొడుకులకు కనీసం తండ్రి వర్ధంతి రోజున ఆయనకు నివాళులు అర్పించాలనే స్పృహ కూడా లేదా? ఉన్నప్పుడేనా వైభవం.. లేకపోతే పట్టించుకోరా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

also read :‘పుష్ప 2’ వివాదం నిజమేనా? దేవిశ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టే ఆలోచనలో సుకుమార్.. అసలేం జరుగుతోంది?

ఏది ఏమైనా తాతామనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, ప్రేమాభిషేకం, బొబ్బిలి పులి, ఒసేయ్ రాములమ్మ, సర్దార్ పాపారాయుడు, తాండ్ర పాపారాయుడు, బలిపీఠం, గోరింటాకు, శివరంజని వంటి సంచలన చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకదిగ్గజానికి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×