E-Paper
Advertisement

Sankranti 2027: నందమూరి వార్ తప్పదా? అనిల్ భలే స్కెచ్ వేసారే?

Sankranti 2027: నందమూరి వార్ తప్పదా? అనిల్ భలే స్కెచ్ వేసారే?
Advertisement

Sankranti 2027: 2026 సంక్రాంతి ముగిసిందో లేదో 2027 సంక్రాంతి బరిలో ఎవరు దిగబోతున్నారు? ఎవరి మధ్య పోటీ ఎలా ఉండనుంది? ఎవరు ఏ కథతో రాబోతున్నారు అనే విషయాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.. అయితే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు 2027 సంక్రాంతి పోరు సినీ వర్గాలలో సెగలు పుట్టిస్తోంది . ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి (Nandamuri ) హీరోల మధ్య వార్ అన్నట్లుగా ఒక ఆసక్తికరమైన పోరు నెలకొనే సూచనలు దాదాపు కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ (Balakrishna), కళ్యాణ్ రామ్(Kalyan Ram) సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండడంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది.

2027 సంక్రాంతి వార్..

అసలు విషయంలోకి వెళ్తే.. 2024 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ మలినేని (Gopichandh malineni) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈసారి మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. పైగా వీరిద్దరి కలయికలో వచ్చిన వీర సింహారెడ్డి మంచి విజయం సొంతం చేసుకోవడంతోనే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి టార్గెట్ గా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు వేగంగా పూర్తి చేసుకుంటోంది.

నందమూరి హీరోల మధ్య పోటీ..

Advertisement

మరోవైపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కలసిన మల్టీ స్టారర్ చిత్రం కూడా సంక్రాంతికి సిద్ధమవుతోంది. వినోదానికి పెద్ద పీట వేసే అనిల్ రావిపూడి ఈ సినిమాని కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ కూడా సంక్రాంతి రేసులో నిలవడంతో నందమూరి అభిమానుల మధ్య ఒక విలక్షణమైన పోటీ వాతావరణం కనిపిస్తోందని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ విషయం చూసి.. అనిల్ రావిపూడి భలే సెట్ చేశారే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే బాలకృష్ణ సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయాలని, గోపీచంద్ డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేసినప్పుడే దాదాపు ఈ విషయాన్ని చెప్పేశారు. అటు వెంకటేష్ తో మళ్లీ సినిమా చేయబోతున్న అనిల్ రావిపూడి వేరొకరిని హీరోగా పెట్టుకోకుండా బాలకృష్ణకు పోటీగా కళ్యాణ్ రామ్ ని ఇంకో హీరోగా సెట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి వార్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి . ఏదేమైనా అనిల్ రావిపూడి కావాలని ఇలా ప్లాన్ సెట్ చేశారో లేదా యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే 2027 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నందమూరి వర్సెస్ నందమూరి అన్నట్టుగా సాగనుంది.

ALSO READ:Anchor Anasuya: యాంకర్ అనసూయకి స్టేజ్ పై ఘోర అవమానం.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

ఇద్దరిలో ఎన్టీఆర్ సపోర్ట్ ఎవరికి?

Advertisement

ఇద్దరికీ సపోర్ట్ విషయానికి వస్తే..” మ్యాన్ ఆఫ్ మోసెస్” ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకం కానుంది. మరొకవైపు అన్నయ్య కళ్యాణ్ రామ్ సినిమాలకు ఎప్పుడూ కూడా సపోర్టుగా నిలిచే ఎన్టీఆర్. ఈసారి ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఒకవేళ ఎన్టీఆర్ ఈ చిత్రానికి గనుక చీఫ్ గెస్ట్ గా వస్తే మాత్రం సినిమాపై హైప్ అమాంతం పెరగడం ఖాయం అనే చెప్పాలి. ఒకవైపు బాబాయ్ సినిమా మరొకవైపు అన్నయ్య సినిమా కావడంతో ఎన్టీఆర్ దాదాపుగా తన అన్నయ్యకే సపోర్ట్ చేస్తారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాలను అభిమానులు రెండు వర్గాలుగా విభజిస్తారా లేక రెండు సినిమాలను ఆదరిస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా 2027 సంక్రాంతి మాత్రం నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతుందని చెప్పవచ్చు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×