E-Paper
Advertisement

Anchor Anasuya: యాంకర్ అనసూయకి స్టేజ్ పై ఘోర అవమానం.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Anchor Anasuya: యాంకర్ అనసూయకి స్టేజ్ పై ఘోర అవమానం.. మరీ ఇలా  తయారయ్యారేంట్రా?
Advertisement

Anchor Anasuya:ప్రముఖ యాంకర్ అనసూయ(anasuya ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తొలిసారి న్యూస్ రీడర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత ఎన్టీఆర్ ( NTR) ‘నాగ ‘ సినిమాలో సునీల్ పక్కన లాస్ట్ స్టూడెంట్ గా కొద్దిసేపు కనిపించి అదృశ్యం అయింది. ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనసూయ.. దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా బుల్లితెరపై సందడి చేసి అబ్బురపరిచింది. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో.. పంచ్ డైలాగ్లతో షోకే సరికొత్త టిఆర్పి రేటింగ్ తీసుకొచ్చిన ఈమె.. తన అందాల జాతరతో బుల్లితెరకు గ్లామర్ ను తీసుకొచ్చింది.

ఆంటీ అంటూ అవమానం..

అలాంటి అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఇటు తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్ కి ఎప్పుడూ చేరువలో ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎవరైనా తనపై ట్రోల్స్ చేశారంటే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వకుండా వదిలేయదు.. అలా ప్రతి విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. గత రెండు సంవత్సరాలుగా “ఆంటీ” అనే పిలుపుతో ఘోరమైన అవమానాలను పొందుతోంది. అయితే తనను ఆంటీ అని పిలవకండి అని , తాను తమకేమీ ఆంటీను కాదు అంటూ బహిరంగంగా మండిపడిన ఈమెను ఇప్పుడు మళ్లీ అలాంటి మాటను ప్రస్తావిస్తూ బహిరంగ సభలో అవమానించారు.

స్టేజ్ పై చేదు అనుభవం..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఒక కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యారు అనసూయ. ఈ క్రమంలో స్టేజ్ పై ఆమె మాట్లాడుతుండగానే.. కింద నుంచి పలువురు “ఆంటీ.. ఆంటీ” అంటూ గట్టిగా కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా ఆంటీ అని పిలవడంతో అనసూయ ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో తన మోము పై చిరునవ్వును చిందిస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో సెలబ్రిటీలను ఇబ్బందిపరిచే మాటలు మాట్లాడకూడదు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అనసూయకి ఇలాంటి అవమానం జరగడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ALSO READ:Naga Chaitanya: హీరో నాగచైతన్యకు తప్పిన ప్రమాదం.. ఊపిరిపీల్చుకున్న ఫ్యాన్స్!

బుల్లితెర నుండి వెండితెరకు..

Advertisement

ఇక అనసూయ కెరియర్ ప్రస్థానం విషయానికి వస్తే.. బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంతో యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్న ఈమె.. మరొకవైపు రంగస్థలం సినిమాతో సినీ ఇండస్ట్రీలో రంగమ్మత్త గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే రజాకార్ సినిమాతో తన నటనలోని విశ్వరూపాన్ని చూపించిన ఈమె.. పుష్ప సినిమాలో విలన్ పాత్రతో అదరగొట్టేసింది. అంతేకాదు ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకున్న ఈమె గత ఏడాది ఆఖరిలో శివాజీ స్త్రీ వస్త్రధారణపై చేసిన కామెంట్లపై స్పందించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఇలా బహిరంగంగా అవమానం ఎదుర్కోవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×