E-Paper
Advertisement

Samantha: క్రేజీ కాంబినేషన్ రిపీట్, నందిని సమంతకు ఈ సినిమా హిట్ కీలకం

Samantha: క్రేజీ కాంబినేషన్ రిపీట్, నందిని సమంతకు ఈ సినిమా హిట్ కీలకం
Advertisement

Samantha: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్లలో నందిని రెడ్డి ఒకరు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చింది నందిని రెడ్డి. నాని నిత్యామీనన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత నందినీకి మంచి అవకాశాలు వచ్చాయి.

అయితే సిద్ధార్థ్ మరియు సమంత హీరో హీరోయిన్ గా నటించిన సినిమా జబర్దస్త్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. మళ్లీ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన కల్యాణ వైభోగమే సినిమా కొంతమేరకు నందిని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన ఓ బేబీ సినిమా మంచి హిట్ అయింది.

ఆ సినిమా ఆగిపోలేదు 

Advertisement

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలానే ఆ సినిమా కూడా ఆగిపోయింది అన్నట్లు ఇంకొన్ని వార్తలు వినిపించాయి. ఓ బేబీ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది. సమంత – నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ’మా ఇంటి బంగారం’ సినిమా ఆగిపోలేదు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలవుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.

సమంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. గతంలో ఓ బేబీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారు అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. రీసెంట్ గా సమంత కనిపించిన శుభం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అన్నీ మంచి శకునములే 

Advertisement

ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ ఫిలిం అన్నీ మంచి శకునములే. ఈ సినిమా కమర్షియల్ గా ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పటికీ చాలామందికి అది ఒక ఫేవరెట్ ఫిలిం. నందిని రెడ్డి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా తీశారు అని చాలామంది ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు.

అలానే ఆ సినిమాకి సంబంధించి మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. నందిని చేసిన అంతకు ముందు సినిమా ఓ బేబీ కు కూడా మిక్కి సంగీతం అందించాడు. ఆ సినిమా సాంగ్స్ కూడా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ అని చెప్పాలి.

Also Read: Ram Charan: మెహర్ రమేష్ దర్శకత్వంలో రామ్ చరణ్.? మెగా ఫ్యాన్స్ ఇంకెన్ని దారుణాలు చూడాలో

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×