Cyclone Montha: మొంథా తుఫాన్ ఏపీ ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తుఫాను హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబుకు ప్రధాన మంత్రి ఫోన్ చేశారు. తుఫాను పరిస్తితిపై ఆరా తీశారు. కేంద్రం సాయం పూర్తి స్థాయిలో ఉంటుందని భరోసా ఇచ్చారు.
తుఫాను ప్రభావంతో సీఎం మంత్రులతో పాటు, అధికారులతో రివ్యూ నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కాకినాడ తీరంలో కల్లోలంగా మారింది. మచిలీపట్నం, కలింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లో స్కూల్స్ , కాలేజీలు ప్రకటించారు.
తుఫాను ప్రభావంతో ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండంతో తుఫానుగా బలపడింది. ప్రస్తుతానికి చెన్నైకి ఆరు వందల మీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. విశాఖకు 7కిలోమీటర్లు, కాకినాడకు 650 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రాత్రికి తీరం దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మొంథా తుఫానుపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని.. జిల్లాల్లో అత్యవసర సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు.
Also Read: మొంథా తుపాను ఎఫెక్ట్.. భారీగా రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే
మరోవైపు మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలని సూచించారు.. పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
మొంథా తుఫాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు
మొంథా తుఫానుపై ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు అందించాలని ఆదేశాలు
కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్న చంద్రబాబు
పునరావాస కేంద్రాల్లో… https://t.co/sutXZZW9XG pic.twitter.com/xLdjV054nj
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2025