Ram Charan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో మెహర్ రమేష్ ఒకరు. కంత్రి సినిమాతో దర్శకుడుగా పరిచయమైన మెహర్ చాలామంది హీరోలతో సినిమాలు చేశారు. మెహర్ రమేష్ కు చాలా మంది స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చారు కానీ ఊహించిన సక్సెస్ ఒకటి కూడా సాధించలేకపోయాడు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ ఈ సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయాయి.
అయితే అందరికీ షాక్ ఇచ్చే విషయం ఏంటి అని అంటే మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయటం. మొదట ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చాలామంది ట్రోల్ చేసి జోక్ అనుకున్నారు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది నిజం అని తెలియగానే షాక్ కి గురి అయ్యారు. మరోవైపు మెహర్ రమేష్ చిరంజీవికి సినిమా ఇవ్వడానికి కారణం బంధువు కూడా అవ్వడమే
మెగాస్టార్ తనయుడు గా చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అక్కడితో వరుసగా సినిమాలు చేస్తూ చరణ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుని ఒక స్టార్ హీరోగా మారిపోయాడు చరణ్. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయిన కూడా, రంగస్థలం సినిమాతో తిరుగులేని నటుడు అని పేరు సంపాదించుకున్నాడు.
చరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపించిన తీరు అద్భుతం. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మెహర్ రమేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తారు అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ న్యూస్ తెలిసిన వెంటనే చాలా మంది చరణ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
మెగా అభిమానులు ఇంకెన్ని దారుణాలు చూడాలో అని విపరీతంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. బహుశా మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ కి బంధుత్వం ఉంటే ఉండొచ్చు. కానీ సినిమా విషయంలో అది ఏ మాత్రం ఉండకూడదు అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి సినిమా ఛాన్స్ ఇచ్చినప్పుడు భోళా శంకర్ లాంటి డిజాస్టర్ సినిమా మెహర్ రమేష్ తీశాడు కాబట్టి. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా మెహర్ రమేష్ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇప్పటివరకు అధికారకు ప్రకటన రాలేదు.
Also Read: Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?