HBD Nani : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని, ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఒక్కో సినిమాతో తనలోని టాలెంట్ ని నిరూపించుకుంటూ.. వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈమధ్య ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ గా నిలుస్తున్నాయి.. గత ఏడాది నాని నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా హిట్ 3 మూవీ భారీ విజయాన్ని అందుకుంది.. ఈ ఏడాది ది ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. నాని బర్త్డే సందర్భంగా ఆయన నటించిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..
స్టార్ హీరో నాని 2008లో అష్టా చమ్మా మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.. అతడి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది ఆ చిత్రం.. ఈ మూవీ తర్వాత అలా మొదలైంది సినిమాలో నటించాడు.. ఈ మూవీ కూడా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది.. 2011లో పిల్ల జమిందార్ మూవీ లో నటించాడు. ఈ మూవీ కూడా సాలిడ్ హిట్ సొంతం చేసుకుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ మూవీ నానికి మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.. కృష్ణ గాడి వీర ప్రేమ కథ, జెంటిల్మెన్, నేను లోకల్, నిన్ను కోరి, జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్, దసరా, హయ్ నాన్న, హిట్ 3 వంటి సినిమాలు నాని కెరియర్ లోనే అత్యంత భారీ వసూళ్లను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం నాని వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకి పోటీనిస్తూ వస్తున్నాడు.. ఈమధ్య నాని ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా హిట్ అవ్వడంతో అతని మార్కెట్ కూడా భారీగా పెరిగింది. శక నిర్మాతలు నానితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం..
Also Read : ‘విష్ణు విన్యాసం ‘ నుంచి సాంగ్ వచ్చేసింది.. పెళ్లంటే కష్టమంటున్న హీరో..
దసరా మూవీ తో యాక్షన్ హీరోగా మారిన నాని.. ఆ తర్వాత ఆ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రెండు జడలతో నాని కనిపిస్తాడు. కాకుల స్టోరీ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు బయటకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ మూవీ ని చూస్తుంటే నాని కెరియర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ పడబోతుంది అని అర్థమవుతుంది.. ఇక నేడు నాని బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా అప్డేట్స్ రిలీజ్ అవుతున్నాయి.. ఈ మూవీ వచ్చేనెల 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది..