E-Paper
Advertisement

AP Council Session-2026: డోర్ డెలివరీ ఇష్యూ.. నిందితుల కోసం వెతుకుతున్నాం, మండలిలో హోంమంత్రి

AP Council Session-2026: డోర్ డెలివరీ ఇష్యూ.. నిందితుల కోసం వెతుకుతున్నాం, మండలిలో హోంమంత్రి
Advertisement

AP Council Session-2026: మహిళలకు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందన్నారు హోం మంత్రి అనిత. ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందనే సందేశం ప్రజల్లోకి పంపామన్నారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టాలమని, డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. నేరాలు పెరిగాయన్న వైసీపీ సభ్యురాలు కల్యాణి చేసిన ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు.

మహిళల భద్రతలపై మండలిలో చర్చ

Advertisement

మండలి సమావేశాలు తొమ్మిదో రోజు మంగళవారం సభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి రాష్గ్రంలో శాంతి భద్రతల అంశంపై నోరు విప్పారు. గతేడాది 1485 కేసులు నమోదు అయినట్టు స్వయంగా మంత్రి చెప్పారని, 10 జిల్లాల్లో మహిళలపై నేరాల సంఖ్య విపరీతంగా పెరిగాయన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాలో మహిళలపై 10 శాతం నేరాలు పెరిగాయని వివరించారు.

ముఖ్యమంత్రి నీడలో మహిళలకు రక్షణ లేదంటూ విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు. సభ జరుగుతున్న సమయంలో మదనపల్లెలో ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని చెప్పుకొచ్చారు. వివిధ జిల్లాలో పెరిగిన కేసుల గురించి తెలిపారు. హోంమంత్రి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జిల్లాలో నేరాలు పెరిగాయని గుర్తు చేశారు.

Advertisement

వైసీపీ ప్రశ్నలకు హోంమంత్రి అనిత వివరణ

వైసీపీ సభ్యురాలు లేవనెత్తిన అంశాలపై హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పాఠశాలల విద్యార్థుల బ్యాగుల్లోకి గంజాయి వెళ్లిందన్నారు. ఇప్పుడు విద్యార్థులు గంజాయి వద్దంటూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయిని కంట్రోల్ చేసే విషయంలో ఏపీని చూసి మిగతా రాష్ఠ్రాలు నేర్చుకోవాలంటూ కొన్ని సంస్థలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఒకప్పుడు డ్రగ్స్, గంజాయికి హబ్‌గా ఏపీ ఉండేదని, ఇప్పుడు అరికట్టే స్థాయికి తెచ్చామన్నారు. దటీజ్ అవర్ పోలీసులు, మా పరిపాలన అని అన్నారు. మదనపల్లె ఘటన గురించి నోరు విప్పారు హోం మంత్రి. జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుందన్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. ఆ ఒత్తిడి లేకుంటే నిందితుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నించారు.

ALSO READ: కలవరపెడుతున్న డయేరియా.. అనారోగ్యం కోరల్లో శ్రీకాకుళం వాడలు!

పోక్సో కేసులో మూడునెలల్లో అనేక మంది నిందితులకు శిక్ష పడిన సందర్భాలు గుర్తు చేశారు. ఆయా కేసుల్లో 9 మందికి మరణశిక్ష విధించామన్నారు. 169 మంది జీవిత ఖైదు పడిందన్నారు. అందరి కోసం వెతుకుతున్నామని, డోర్ డెలివరీ చేసినవారి కోసం వెతుకుతున్నామన్నారు. ఏ కేసులోనైనా 24 గంటలు లేదంటే 48 గంటల్లో నిందితులను పట్టుకుని జైలులో వేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలియజేశారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×