Nani Fan: అభిమానం పలు రకాలుగా ఉంటుందనే విషయం, ఇప్పటికే ఎంతో మంది అభిమానులు తెలియజేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల కోసం పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ అభిమానులు చేయడం, చివరికి వారిని కలుసుకోవడం వంటి సంఘటలను ఇప్పటి వరకు చాలానే జరిగాయి. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) వంతు వచ్చింది. అవును, నానిపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకోవడానికి, ఆటో వరద అనే అభిమాని (Nani Fan) తిరుపతి నుండి హైదరాబాద్ వరకు 500 కిలోమీటర్లకు పైగా సైకిల్ మీద ప్రయాణించారు. ఈ సాహసోపేతమైన యాత్రను పూర్తి చేసిన వరద, చివరికి హైదరాబాద్‌కు చేరుకుని తన అభిమాన హీరోని కలుసుకున్నాడు. నానిని కలవడం అనేది తన జీవితంలో ఒక కల నెరవేరినట్లుగా అనిపించిందని వరద ఆనందం వ్యక్తం చేశాడు.
Also Read- Netflix Subscription Hike: సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంచేసిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త ప్లాన్స్ ధరలు ఇవే
హైదరాబాద్‌కు చేరుకున్న వరద, నానిని కలుసుకున్నప్పుడు తన ప్రయాణం గురించి వివరంగా వివరించాడు. వరద చేసిన సాహసాన్ని తెలుసుకున్న నాని చాలా ఆశ్చర్యపోయారు. నాని ఆత్మీయంగా వరదను ఆహ్వానించి, అతనితో కొద్దిసేపు సంభాషించి, తన అభినందనలు తెలిపాడు. అంతేకాకుండా, నానిని అభిమాని సన్మానించగా, నేను కాదు హీరో.. మీరేనంటూ ఆ షాలువాను వరదకు కప్పి నాని సన్మానించారు. ఇది అభిమానిపై అతను చూపిన ప్రేమని తెలియజేస్తుంది. ‘ఆటో వరద’ (Auto Varada) ఒక యూట్యూబర్, ఆర్టిస్ట్ కూడా. తన యాత్రను తన ఛానల్ ద్వారా కూడా ప్రచారం చేశారు. అభిమాని చేసిన ఈ సాహసోపేతమైన ప్రయాణం, లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం, నిజంగా అతని నిబద్ధతని తెలియజేస్తుంది. ఈ సంఘటన ఇతర అభిమానులకు స్ఫూర్తినిస్తుందని మరియు నటుల పట్ల ఉన్న అభిమానం ఏ స్థాయికి వెళ్లగలదో చూపిస్తుందనేలా ఈ ఘటనే టాక్ మొదలైంది.
Also Read- Allu Arjun: అల్లు అర్జున్ కు డాన్స్ నేర్పించింది నేనే.. క్రెడిట్ మొత్తం చోరీ చేసిన నటి!
అభిమానులు మంచి పనులు చేస్తే చూడాలని, అందుకు వారిని ప్రోత్సహించాలని హీరోలు కూడా అనుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి వంటి వారు తమ అభిమానులను ఎంతగా ప్రోత్సహిస్తారో, వారితో సేవా కార్యక్రమాలు ఎలా చేయిస్తుంటారో తెలియంది కాదు. ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ కూడా ఒక అసోసియేషన్ స్థాపించి, వారితో యేడాదికి ఒక మంచి పని అనేలా ముందుకు వెళుతున్నారు. ఇక నాని విషయానికి వస్తే, ఊహించని రేంజ్‌లో, ఎవరికీ అందని విధంగా ఆయన ప్లానింగ్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తన తోటి హీరోలు పాన్ ఇండియా సినిమా చేయడానికే ఇబ్బందులు పడుతుంటే, నాని మాత్రం ఏకంగా ‘ది ప్యారడైజ్’తో పాన్ వరల్డ్ సినిమాను దించబోతున్నారు. నాని ఇదంతా చేయగలుగుతున్నారంటే, ‘ఆటో వరద’ వంటి అభిమానులే కారణం అని చెప్పొచ్చు. ఏదిఏమైనా, ఒక అభిమాని తన పట్ల ఇంత అభిమానం చూపించడంతో నాని కూడా చాలా హ్యాపీగా ఫీలైనట్లుగా ఈ పిక్స్ చూస్తుంటే తెలుస్తోంది.
Also Read- Director Maruthi: తదుపరి కథకు తుది మెరుగులు దిద్దుకుంటున్నా.. అందుకు కృషి చేస్తా!