E-Paper
Advertisement

Horror Thriller OTT : అమెరికన్ సినిమాలో ఇండియన్ దెయ్యం… దోస్తులందరికీ చుక్కలు… మస్తు పరేషాన్ చేసే సినిమా

Horror Thriller OTT : అమెరికన్ సినిమాలో ఇండియన్ దెయ్యం… దోస్తులందరికీ చుక్కలు… మస్తు పరేషాన్ చేసే సినిమా
Advertisement

Horror thriller OTT : భయం అంటే ఏంటో చూపించే గట్టి హారర్ సినిమా చూడాలని ఉందా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూస్తే, భయం దానంతట అదే వచ్చేస్తుంది. ఇండియన్ పురాణాల, అమెరికన్ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఒక పీడకల లాంటి కథ ఇది. 1 గంట 39 నిమిషాల పాటు మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఈ సినిమా. ఇందులో మన పురాణాల్లోని దెయ్యాన్ని చూపించి, దానికి హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌ని జోడించారు మేకర్స్.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2023 లో వచ్చిన ఈ హారర్ సినిమా పేరు ‘ఇట్ లివ్స్ ఇన్సైడ్’ (It Lives Inside). ఈ సినిమా దర్శకుడు బిషల్ దత్తా తన చిన్నప్పుడు విన్న దెయ్యం కథల ఆధారంగా దీనిని రూపొందించాడు. అతని తాతయ్య చెప్పిన ఒక వింత కథ ఈ సినిమాకి మెయిన్ ఇన్‌స్పిరేషన్. ఇందులో మేగాన్ సూరి (సామ్), నీరూ బజ్వా (తల్లి), మోహన కృష్ణన్ (తమిరా) నటించారు. సినిమాలో మెయిన్ లీడ్ చేసిన మేగాన్ సూరి తన నటనతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో ఆమె యాక్టింగ్ అదిరిపోతుంది. ఈ సినిమాను ‘Get Out’, ‘Us’ వంటి బ్లాక్‌బస్టర్ హారర్ సినిమాలను నిర్మించిన ప్రొడక్షన్ టీమ్ నిర్మించింది. అందుకే ఇందులో హారర్ సీన్లు చాలా క్వాలిటీగా, కొత్తగా ఉంటాయి. ఇది 2023లో జరిగిన సౌత్ బై సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘మిడ్ నైట్ ఎపిసోడ్’ కేటగిరీలో ఆడియన్స్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

అమెరికాలో పుట్టి పెరిగిన సామ్ అనే అమ్మాయి అక్కడ ఒక హైస్కూల్‌లో చదువుకుంటూ ఉంటుంది. తన పక్కన ఉండే తెల్లజాతి స్నేహితులతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే తన ఇంట్లో వాళ్ళు పాటించే పద్ధతులను, సంప్రదాయాలను అసహ్యించుకుంటుంది. ఇక పూజలు, పునస్కారాలు అస్సలు నచ్చవు. తెల్లవాళ్ళతో కలిసిపోయి అల్ట్రా మోడ్రన్ అయిపోవాలని తెగ ట్రై చేస్తుంటుంది. ఇక కథలో తన పాత ఫ్రెండ్ తమిరా మాత్రం పిచ్చిదానిలా ఒక పాత గాజు సీసా పట్టుకుని తిరుగుతుంటుంది. ఆ సీసాలో ఏదో ఉంది అని సామ్‌కి చెబితే, నువ్వు మరీ చాదస్తంగా తయారయ్యావని ఆవేశంలో ఆ సీసాని కిందకేసి కొడుతుంది. అంతే అసలు సినిమా అక్కడే మొదలవుతుంది.

ఆ సీసా పగిలిపోగానే అందులో నుంచి ఒక పురాతనమైన, రక్తం తాగే పిశాచి బయటపడుతుంది. అది మామూలు దెయ్యం కాదు, ఎదుటివాడి ఒంటరితనాన్ని, భయాన్ని వాడుకుని వాడి ప్రాణాలు తీసేస్తుంది. ఆ దెయ్యం వెంటనే సామ్ ఫ్రెండ్ తమిరాని మాయం చేస్తుంది. సామ్ చుట్టూ ఉన్నవాళ్ళని కూడా ఒక్కొక్కరిని వేటాడటం మొదలుపెడుతుంది. సీన్ కట్ చేస్తే, ఆ దెయ్యం సామ్ వెనకాలే పడి నరకం చూపిస్తుంది. చివరికి సామ్ తను ఏ సంస్కృతినైతే అసహ్యించుకుందో, అదే తనని కాపాడుతుందని తెలుసుకుంటుంది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని, ఆ పిశాచిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ వేస్తుంది. చివరికి ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ రాక్షసితో ఫైట్ చేస్తుంది. ఈ ఫైట్ లో సామ్ ఆ దెయ్యాన్ని ఓడిస్తుందా ? ఆమె తన ఫ్రెండ్‌ని కాపాడుకుందా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : నడి సముద్రంలో అలల తుఫాను… చావు కోరల్లో 30 మంది ప్రాణాలు… నరాలు తెంపే ఉత్కంఠ

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×