E-Paper
Advertisement

The Paradise release Date: జూన్ నెలలోనే ది ప్యారడైజ్…రిలీజ్ డేట్ కన్ఫర్మ్?

The Paradise release Date: జూన్ నెలలోనే ది ప్యారడైజ్…రిలీజ్ డేట్ కన్ఫర్మ్?
Advertisement

The Paradise release Date: నేచురల్ స్టార్ నాని (Nani)ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్ (The Paradise)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఎస్ ఎల్ వి సినీ బ్యానర్ పై ఈ సినిమాని చెరుకూరు సుధాకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని తల్లి పాత్రలో సీనియర్ నటి సోనాలి కులకర్ణి నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

జూన్ నెలను టార్గెట్ చేసిన నాని..

ఇకపోతే ఈ సినిమా విడుదల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా నిజానికి మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సినిమా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా దాదాపు వాయిదా పడిందని చెప్పాలి. అయితే మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమా మరి ఎప్పుడు విడుదల కాబోతుందనే విషయంపై కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇలా మార్చి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా వేసవి సెలవులలో విడుదల కాబోతుందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ వేసవిలో కాకుండా ఈ సినిమా జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

జడల పాత్రలో నాని…

Advertisement

జూన్ 25, 2026 వతేదీ ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదల తేదీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక నాని ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు ఈయన జడల అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రెండు జడలతో గుబురు గడ్డం, ముక్కు పుడకతో నాని మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇలా నాని లుక్ పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలను పెంచేసింది.

విలన్ పాత్రలో మోహన్ బాబు..

Advertisement

ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు కూడా భాగమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోహన్ బాబు విలన్ గా నటించబోతున్నారు అంటూ చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు అదేవిధంగా సంపూర్ణేష్ బాబు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి వంటి తదితరులు ఈ సినిమాలో భాగం అయ్యారు. ఇక ఈ సినిమాకు దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నాని శ్రీకాంత్ కాంబినేషన్ లో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×