E-Paper
Advertisement

Kiara Advani: బీఫ్, పోర్న్ నిషేధంపై కియారా అద్వానీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు అంటూ..!

Kiara Advani: బీఫ్, పోర్న్ నిషేధంపై కియారా అద్వానీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు అంటూ..!
Advertisement

Kiara Advani: గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు.. నటి కియారా అద్వానీకి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో దాదాపు పది సంవత్సరాల క్రితం, అంటే 2015లో తీసినది. ముంబైలో జరిగిన జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కార్యక్రమంలో ఆమె ఒక చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి.

ఆ వీడియోలో కియారా అద్వానీ బీఫ్ నిషేధం, పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ, “ముందు బీఫ్, ఇప్పుడు పోర్న్. తర్వాత ఏమి నిషేధిస్తారో ఎవరికీ తెలియదు. ఇలా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదేమో” అని చెప్పింది. అప్పట్లో మహారాష్ట్రలో బీఫ్ అమ్మకం..వినియోగంపై నిషేధం అమల్లోకి రాగా..అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అడల్ట్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది.

Advertisement

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రిపబ్లిక్ డే ముందు తిరిగి బయటకు రావడంతో పెద్ద వివాదంగా మారాయి. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కియారాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆమెను దేశవ్యతిరేకి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ అంశాలపై నటీనటులు మాట్లాడకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే మరోవైపు, కియారాకు మద్దతుగా నిలిచే వాళ్లు కూడా ఉన్నారు. ఇది పది సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్య అని, అప్పటి పరిస్థితుల ప్రకారం ఆమె మాట్లాడిందని వారు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ వీడియోని ఇప్పుడు కావాలని బయటకు తీసి ట్రోల్ చేయడం సరికాదని కూడా అంటున్నారు.
ఇప్పటికే తల్లి అయిన కియారా అద్వానీ ప్రస్తుతం తన కుటుంబ జీవితంపై దృష్టి పెడుతోంది. కానీ ఈ పాత వీడియో కారణంగా ఆమె పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.

Advertisement

ALSO READ: Border 2 OTT : మూడు దశాబ్దాల తర్వాత తెరపైకి వచ్చిన సీక్వెల్ ‘బోర్డర్ 2’… ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లాక్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×