E-Paper
Advertisement

Horror Thriller OTT : సినిమా 89 నిమిషాలే… లైఫ్ లాంగ్ వెంటాడే హర్రర్ సీన్లు భయ్యా

Horror Thriller OTT : సినిమా 89 నిమిషాలే… లైఫ్ లాంగ్ వెంటాడే హర్రర్ సీన్లు భయ్యా
Advertisement

Horror Thriller OTT : జంతువులను లీడ్ రోల్స్ లో పెట్టి ఎన్నో సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇది ఒక పెంపుడు చింపాంజీ గురించిన భయంకరమైన హారర్ స్టోరీ. ఇందులో ఇది ఒకలాంటి రక్త పిశాచిగా మారి ఊచకోత కొస్తుంది మనుషులను. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, మేకప్‌ను ఉపయోగించి చింపాంజీని భయంకరంగా చూపించారు. విమర్శకులు దీనిని ఒక పాతకాలపు స్లాషర్ మూవీలా ఉందని కొనియాడారు. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

స్ట్రీమింగ్ ఎందులో అంటే

ఈ అమెరికన్ నేచురల్ హారర్ చిత్రం పేరు ‘ప్రైమేట్’ (Primate). దీనికి జోహన్నెస్ రాబర్ట్స్ దర్శకత్వం వహించారు. ఇందులో జానీ సీక్వోయా, జెస్సికా అలెగ్జాండర్, ట్రాయ్ కోట్సుర్ నటించారు. ప్రైమేట్ 2025 సెప్టెంబర్ 18న ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో ప్రీమియర్ అయింది. 2026 జనవరి 9న పారామౌంట్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా $24 మిలియన్లు వసూలు చేసింది ఈ సినిమా. ప్రస్తుతం థియేటర్లలో ఉంది కానీ త్వరలో Paramount +, Prime Videoలో ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హవాయిలోని ఒక ఎత్తైన కొండపై ఉన్న విలాసవంతమైన భవంతికి, లూసీ అనే కాలేజీ అమ్మాయి తన వేసవి సెలవుల కోసం వస్తుంది. అక్కడ ఆమె తండ్రి ఆడమ్, సోదరి ఎరిన్ ఉంటారు. ఆ కుటుంబంలో ‘బెన్’ అనే చింపాంజీ కూడా ఉంటుంది. లూసీ తల్లి ఆ చింపాంజీని ఒక ప్రయోగశాల నుండి రక్షించి ఇంటికి తెస్తుంది.  కాబట్టి ఆ కుటుంబానికి దానితో ఎంతో అనుబంధం ఉంటుంది. అయితే లూసీ తల్లి ఇదివరకే చనిపోయి ఉంటుంది. ఒక రోజు బెన్ అనే ఆ చింపాంజీని ఒక ముంగిస కరుస్తుంది. దీనివల్ల దానికి భయంకరమైన రాబిస్ వ్యాధి సోకుతుంది.

అదే సమయంలో లూసీ ఇంట్లో తన స్నేహితులతో కలిసి ఒక పూల్ పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది. తండ్రి ఆడమ్ పని మీద బయటకు వెళ్లాల్సి వస్తుంది. రాబిస్ వ్యాధి సోకడం వల్ల బెన్ ప్రవర్తన ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. అది ఇంట్లో ఉన్న లూసీ స్నేహితులపై దాడి చేయడం మొదలుపెడుతుంది. రాబిస్ సోకిన జంతువులకు నీరు అంటే భయం ఉంటుంది. అందుకే లూసీ, ఆమె స్నేహితులు ఆ చింపాంజీ నుండి తప్పించుకోవడానికి స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉంటారు. చివరికి ఆ మృగం నుండి వీళ్ళంతా ఎలా ప్రాణాలు కాపాడుకున్నారనేది క్లైమాక్స్.

Advertisement

Read Also : బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్… తెలుగు ఆడియన్స్‌కు నిరాశ తప్పదా ?

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×