Paradise Buzz: పక్కింటి కుర్రాడి పాత్రల్లో పాతుకుపోయిన నాని దసరాతో రూటు మార్చాడు.ఇక ఆ సినిమా ఏకంగా వందకోట్లు కొల్లగొట్టడంతో అదే కాంబోలో ది ప్యారడైస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి .
మొదటి నుంచే భారీ అంచనాలు
ఈ సినిమాలో నాని సరసన టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. వారితో పాటు బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాఘవ్ జుయల్, విలక్షణ నటుడు సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తూ సినిమాపై అంచనాలను స్కై లో పెట్టేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ‘జెర్సీ’ (2019) మరియు ‘గ్యాంగ్ లీడర్’ (2019) వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత నాని, అనిరుధ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో పాటలపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
also read :రామ్-అనిల్ రావిపూడి కాంబో.. క్రేజీ ప్రాజెక్టా? లేక డిజాస్టర్ ఫార్ములానా?
150 ప్లస్ మిలియన్ల వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్
అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి నాని ఇంట్రో సాంగ్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్…’ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అందించిన పవర్‌ఫుల్ మాస్ లిరిక్స్, అడ్డుల జంగిరెడ్డి మరియు అర్జున్ చాందీ ఎనర్జిటిక్ వాయిస్ ఈ పాటకు ప్రాణం పోశాయి. ఇక సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో నాని వేసిన సిగ్నేచర్ స్టెప్స్ థియేటర్లను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ఏకంగా 150 ప్లస్ మిలియన్ల వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ నాని సరికొత్త రగ్గడ్ అండ్ స్టైలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్.
గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్
మొత్తంగా నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఏకైక చార్ట్‌బస్టర్‌గా నిలిచిపోయింది ఈ ‘ఆయా షేర్…’.ఇక ఈ పాట రిలీజ్ అయిన క్షణం నుంచే సోషల్ మీడియా రీల్స్, కాలేజ్ ఫెస్ట్స్, పబ్లిక్ ఈవెంట్స్, డ్యాన్స్ స్టేజెస్ ఇలా ఏది జరిగినా ఈ పాటే వినిపిస్తుంది .ఇక ‘హాయ్ నాన్న’ (2023) వంటి క్లాస్ హిట్ తర్వాత నాని చేస్తున్న ఈ కంప్లీట్ మాస్ మేకోవర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. సినిమాటోగ్రాఫర్ సీహెచ్ సాయి తన అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్‌లా ప్లాన్ చేస్తున్నాడట .ఇక కేవలం సౌత్ మార్కెట్ మాత్రమే కాకుండా, గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ భారీ ప్లాన్ చేశారు మేకర్స్
also read :బాబీ సినిమా మొదలైంది కానీ.. ‘విశ్వంభర’ అప్‌డేట్ ఎక్కడ? ఫైర్ అవుతున్న చిరు ఫ్యాన్స్
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో సైతం ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదల కానుంది.చూడాలి మరి రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ (2024) సినిమాతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ అందుకున్న నాని, ఈసారి ‘ది ప్యారడైస్’ తో ఇండియన్ సినిమాని ఎలా షేక్ చేస్తాడో !