Vishwambhara Delay: మన శంకర వరప్రసాద్ అంటూ సాలిడ్ హిట్ కొట్టడంతో మూవీ లవర్స్ ఫోకస్ అంతా విశ్వంభర పైకి మళ్ళింది. సినిమా దాదాపు రెండేళ్ళకి పైగా సెట్స్ మీద ఉండటంతో ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాసేలా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.కానీ ఆ సినిమా రిలీజ్ కాకముందే బాబీ కాంబోలో సినిమా అప్పుడే పరుగులు పెడుతుండటంతో విశ్వంభర మూవీ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది.షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నా కూడా చిత్రం విడుదలపై సరైన క్లారిటీ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
కామెంట్ల వర్షం కురిపిస్తున్న చిరు ఫ్యాన్స్
నిజానికి విశ్వంభర సినిమాను మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ మేకింగ్ ఆలస్యం కావడంతో ఆ తర్వాత సమ్మర్ రేసులోకి తెస్తామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజా పరిస్థితులు గమనిస్తుంటే అనుకున్న సమయానికి సినిమా థియేటర్లలోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. కనీసం రిలీజ్ డేట్ అప్డేట్ అయినా ఇవ్వాలంటూ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ ని ట్యాగ్ చేస్తూ నెట్టింట్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు చిరు ఫ్యాన్స్.
అసలు కారణం విజువల్ ఎఫెక్ట్స్
చాలా రోజుల తర్వాత చిరంజీవి మళ్లీ జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తరహాలో ఒక భారీ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తుండటంతో ప్రేక్షకులలో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ మరియు కునాల్ కపూర్ లాంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా ఆలస్యానికి అసలు కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనులేనని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
also read :జూన్ 19న వరల్డ్‌వైడ్ రిలీజ్.. తెలుగులో ‘బాలన్ ది బాయ్’ థియేట్రికల్ హక్కులు ఎవరివంటే?
సినిమాలోని సెకండ్ హాఫ్ మొత్తం భారీ గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ పైనే ఆధారపడి ఉండటంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విజువల్స్ అందించేందుకు మేకర్స్ హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ తో వర్క్ చేయిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై లేదా ఆగస్టు నెలకు వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆగస్టు పదిహేను రిలీజ్ ప్లాన్ ?
ముఖ్యంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ సినిమాను రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించవచ్చని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. భోళా శంకర్ నిరాశ పరిచినప్పటికీ మన శంకర వరప్రసాద్ గారు తెచ్చిన భారీ సక్సెస్ తో మెగాస్టార్ మార్కెట్ మళ్లీ పీక్స్ కి చేరింది. ఇలాంటి సమయంలో విశ్వంభర సినిమాను మరింత ఆలస్యం చేయకుండా మేకర్స్ వీలైనంత త్వరగా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి డైలామాకి ఎండ్ కార్డ్ వేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ ఏడైనా చిరు విశ్వంభరతో పలకరిస్తాడా ?లేక వచ్చే ఏడుకి పోస్ట్ పోన్ చేసుకుంటాడా !
also read :మళ్లీ ‘బాలయ్య వర్సెస్ నాగ్’.. 2027 సంక్రాంతి రేసులో మైండ్ బ్లోయింగ్ క్లాష్!