The Paradise: మరికొద్ది రోజులలో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో కొత్త ఏడాది ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రవితేజ, ప్రభాస్ ,చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక 2026 సమ్మర్ కంటే మార్చ్ లో భారీ స్థాయిలో పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. మార్చి నెలలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు వరుసన విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోంది. ఇక 2026 మార్చ్ లో విడుదల కాబోయే సినిమాలలో నాని(Nani) ది ప్యారడైజ్(The Paradise) సినిమా కూడా ఒకటి.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాని 2026 మార్చి 26వ తేదీ విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇదివరకు ప్రకటించారు కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అనుకున్న సమయానికి విడుదల కాలేదని ఈ సినిమా మే 2026 లో రాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై చిత్ర బృందం తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు..
ఇక నేడు ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు కావడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్ మేకర్స్ తెలియచేశారు. ఈ సినిమా అనుకున్న విధంగానే 2026 మార్చి 26 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈ సినిమా విషయంలో చిత్ర బృందం స్పందించి క్లారిటీ ఇవ్వడంతో నాని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి కాబోతున్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయని తెలుస్తుంది.
Team #TheParadise wishes its magnificent director @odela_srikanth a very Happy Birthday ❤🔥
The birthday boy's madness and passion from the sets with a special BTS video today at 10 AM 💥
In CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil, Kannada,… pic.twitter.com/YKxBf9h1AW— SLV Cinemas (@SLVCinemasOffl) December 13, 2025
ఇక వచ్చే ఏడాది మార్చిలో సౌత్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. కే జి ఎఫ్ సెన్సేషనల్ హీరో యష్ టాక్సిక్, రామ్ చరణ్ పెద్ది, అడవి శేష్ డెకాయిట్ సినిమాలు వరుసన విడుదల కాబోతున్నాయి. ఇక సోషల్ మీడియా సమాచారం ప్రకారం రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి నుంచి తప్పుకుంటుందని అయితే పెద్ది విడుదల కాకపోతే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 27న విడుదల కాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మార్చి నెలలో స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా విడుదల కాబోతున్న నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ది ప్యారడైజ్ సినిమాలో నాని జడల అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నాని లుక్ ఎంతో విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Also Read: Big TV Exclusive: మన శంకర వరప్రసాద్ ఫుల్ స్టోరీ ఇదే.. NIA ఏజెంట్ గా చిరంజీవి