E-Paper
Advertisement

Medak District: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయం.. సెల్ టవర్ ఎక్కి హల్‌చల్!

Medak District: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయం.. సెల్ టవర్ ఎక్కి హల్‌చల్!
Advertisement

Medak District: పంచాయతీ ఎన్నికలు అనేక ప్రాంతాల్లో కొందరు సర్పంచ్ అభ్యర్థులకు నిజంగానే ‘తలనొప్పి’గా మారాయి. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఒకవైపు ఉన్నప్పటికీ, గెలుపు కోసం అయ్యే ఖర్చు, ఓడిపోతే ఎదురయ్యే ఆర్థిక నష్టం, ప్రత్యర్థులు అనుసరించే అనైతిక పద్ధతులు వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి కొన్నిచోట్ల ఆందోళనలకు, నిరసనలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఖర్చు చేసిన డబ్బులు తిరిగివ్వాలని ఓటర్లు డిమాండ్ చేయడం, ప్రత్యర్థి వర్గాలు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి.

మెదక్ జిల్లా, నర్సంపల్లి పెద్ద తండాలో ఒక అనూహ్య ఘటన జరిగింది. గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి శంకర్ నాయక్ తీవ్ర నిరసనకు దిగాడు. ఆయన ఏకంగా సెల్ టవర్ ఎక్కి తన ఆందోళనను వ్యక్తం చేశాడు. తనను ఓడించడానికి ప్రత్యర్థి అభ్యర్థి అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారన, ప్రత్యర్థి వర్గం ప్రతి ఓటుకు రూ. 2,000 చొప్పున పంపిణీ చేస్తోందని ఆయన నిరసన వ్యక్తం చేశాడు.

Advertisement

ఈ అక్రమ ధన ప్రవాహం కారణంగా ఎన్నికల్లో తన గెలుపు కష్టమవుతుందని, పేద, నిజాయితీ గల అభ్యర్థులు ఎంత కష్టపడినా ఇలాంటి డబ్బు పంపిణీ ముందు నిలబడలేరని ఆయన ఆవేదన చెందాడు. ప్రత్యర్థి అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కూడా ఆయన మండిపడ్డాడు.

అయితే శంకర్ నాయక్‌కు ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ అనుభవం ఆయనను మరింత కలవరపెట్టింది. గతంలో తాను ఓడిపోవడానికి కూడా ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలే చేశారని, ఇప్పుడు కూడా తనను ఓడించేందుకు వ్యూహాత్మకంగా కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించాడు. “మళ్లీ నన్ను ఓడించడానికి ఈ డబ్బు పంపిణీ పన్నాగం పన్నారు. నిజాయితీగా పోటీ చేసేవారికి విలువ లేకుండా పోతోంది” అని ఆయన వాపోయాడు. ఈ నిరసన వెనుక ఉన్నది కేవలం ప్రత్యర్థిపై కోపం మాత్రమే కాదు, గత ఓటమి చేదు అనుభవం, దాని వల్ల కలిగిన ఆర్థిక, మానసిక నష్టాలు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: ఢిల్లీకి తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.. ‘ఓట్ చోరీ’పై ఏఐసీసీ మహాధర్నా వ్యూహం

శంకర్ నాయక్ ఆందోళన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు నర్సంపల్లి పెద్ద తండాకు చేరుకున్నారు. సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం తరహాలో నిరసన వ్యక్తం చేస్తున్నందున, పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు వారు ప్రయత్నించారు. శంకర్ నాయక్‌తో మాట్లాడి, అతన్ని శాంతింపజేసి, టవర్ దిగి రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాయక్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపి, న్యాయం చేస్తామని తెలిపారు.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×