E-Paper
Advertisement

Big TV Exclusive: మన శంకర వరప్రసాద్ ఫుల్ స్టోరీ ఇదే.. NIA ఏజెంట్ గా చిరంజీవి

Big TV Exclusive: మన శంకర వరప్రసాద్ ఫుల్ స్టోరీ ఇదే.. NIA ఏజెంట్ గా చిరంజీవి

Big tv Exclusive: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NIA అధికారిగా చిరంజీవి..

ఇక ఈ సినిమా ఫుల్ స్టోరీ గురించి కూడా వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి ఒక NIA ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా NIA ఆఫీసర్ గా కొనసాగుతున్న శంకర్ వరప్రసాద్ గారికి మిలీనియర్ అయిన శశిరేఖ పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది తప్ప పెళ్లి చేసుకోరని, ఇలా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కావలసినంత మంచి వినోదాన్ని అందించబోతున్నాయని తెలుస్తోంది. శంకర వరప్రసాద్ శశిరేఖ పాత్రలు సరికొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో క్యామియో పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ పాత్ర సినిమా చివరిలో ఉండబోతుందని సమాచారం. ఏకంగా ఈయన పాత్ర 20 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తోంది.

స్పెషల్ అట్రాక్షన్ గా వెంకటేష్ క్యామియో..

ఈ సినిమా చివరిలో వెంకటేష్ పాత్ర కూడా సినిమాకు హైలైట్ అవ్వడమే కాకుండా, వీరిద్దరి మధ్య వచ్చే సాంగ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే బుల్లి రాజు పాత మొదటి నుంచి ఉండదని, కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి పండుగకు పర్ ఫెక్ట్ సినిమా అని చెప్పాలి.

భారీ స్థాయిలో అంచనాలు..

ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కానీ ఈ సినిమాలన్నీ పరవాలేదు అనిపించినా, ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు మన శంకర వరప్రసాద్ గారిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టారు. ఈ నేపథ్యంలోనే శంకర వరప్రసాద్ గారిపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా చిరంజీవికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారు పాటి సుస్మిత కొణిదెల నిర్మించిన విషయం తెలిసిందే.

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×