E-Paper
Advertisement

నాని ‘ది పారడైజ్’ రీషూట్ పుకార్లపై మేకర్స్ ఫైర్.. రూమర్లు నమ్మితే ఇక అంతే

నాని ‘ది పారడైజ్’ రీషూట్ పుకార్లపై మేకర్స్ ఫైర్.. రూమర్లు నమ్మితే ఇక అంతే
Advertisement

Paradise Rumours : నాని ..పక్కింటి కుర్రాడిగా ఇండస్ట్రీ లో పాతుకుపోయిన ఈ టాలెంటెడ్ న్యాచురల్ స్టార్ తనని తాను వైల్డ్ గా మార్చుకునే పనిలో పడ్డాడు. లవర్ బాయ్ పాత్రలు వేసి బోర్ కొట్టిందేమో కాబోలు. ఈ క్రమంలో ఇప్పటికే దసరా సినిమాతో తనలోని మరో యాంగిల్ బయటపెట్టాడు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెల్సిందే. మార్చి 30, 2023న విడుదలైన దసరా, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచి దాదాపు 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఒక మెమరబుల్ హిట్ గా నిలిచింది. ఇక మళ్లీ అదే క్రేజీ కాంబోలో ఈసారి మరింతగా అంటూ శ్రీకాంత్ ఓదేల కాంబోలోనే ది ప్యారడైజ్ పట్టాలెక్కించాడు.

నెట్టింట చక్కర్లు కొడుతున్న రూమర్స్ 

Advertisement

అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుపై నెట్టింట కొన్ని రూమర్స్ తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్. సినిమా అవుట్‌పుట్ సరిగ్గా రాలేదని, షూటింగ్‌ ఆగిపోయిందని, అక్కడ ఏదేదో జరిగిందని ,అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమైన సీన్స్ ని రీషూట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు మేకర్స్ ని తెగ ఇబ్బంది పెట్టేశాయ్.మాములుగా అయితే ఇలాంటి రూమర్స్ పై ,మేకర్స్ ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వరు.కానీ రూమర్స్ మరింత వైరల్ అవడం తో ఈసారి మాత్రం గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు మేకర్స్.

also read :మెగాస్టార్ లైనప్… 3 ఏళ్లు.. 4 సినిమాలు.. అన్నీ సెన్సేషనే!

Advertisement

ఏ ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు 

.ఈ క్రమంలో ‘ది పారడైజ్’ టీం అఫీషియల్ గా ఒక నోట్ రిలీజ్ చేసి రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేసేసింది. “మా సినిమాను మొదలెట్టినప్పుడు ఎంత క్లారిటీతో ఉన్నామో , ఇప్పుడు కూడా అంగుళం కూడా తేడా లేకుండా అదే పక్కా ప్లాన్ తో షూటింగ్ చేస్తున్నాం” అని కుండబద్దలు కొట్టేశారు మేకర్స్. ఇప్పటికే వంద రోజుల పాటు షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయిందని బ్యాలెన్స్ ఉన్న షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా కోసం ఏ ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని, ఫ్యూచర్ లో కూడా చేయబోమంటూ కుండ బద్దలు కొట్టేసింది.

బేస్ లెస్ న్యూస్  క్రియేట్ చేసే వారిపై లీగల్ యాక్షన్

ఇక సోషల్ మీడియాలో లైకుల కోసం, వ్యూస్ కోసం బేస్ లెస్ న్యూస్ ని క్రియేట్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చింది.ఇక ఈ సినిమాకి సంబందించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా సరే అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే అనౌన్స్ చేస్తామని, అన్-అఫీషియల్ వార్తలను దయచేసి నమ్మవద్దని మూవీ లవర్స్ ని వేడుకుంది చిత్ర యూనిట్ .

చూడాలి మరి మేకర్స్ ఇంతటి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతైనా రూమర్స్ రాయుళ్ళు ఆగుతారా లేక మరిన్ని రూమర్స్ క్రియేట్ చేసి చిక్కుల్లో పడతారా !

also read :గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం.. ఎగ్జిబిటర్ల బంపర్ అనౌన్స్‌మెంట్!

Related News

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

Big Stories

Advertisement
×