E-Paper
Advertisement

మెదక్ ఆదర్ష బ్యాంక్‌లో నయా మొసం.. నకిలీ బంగారంతో రూ.1.79 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్!

మెదక్ ఆదర్ష బ్యాంక్‌లో నయా మొసం.. నకిలీ బంగారంతో రూ.1.79 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్!

Fake Gold Loans: స్వేచ్ఛ బ్యూరో: జిల్లా కేంద్రమైన మెదక్ లోని ఆదర్శ కోపరేటీవ్ అర్బన్ బ్యాంక్ లో మేనేజర్ అనిల్ చేసిన ఘరానా మోసం 16 అకౌంట్ల ద్వారా నకిలీ బంగారం బ్యాంక్‌లో తాకట్టు పెట్టుకొని 179’54 కోట్లు డబ్బులు మళ్లించి చీటింగ్ చేసి బెట్టింగ్ లో పెట్టీ దర్జాగా చేతులు ఎత్తేసిన బ్యాంకు మేనేజర్ అనిల్ తో సహా భార్య శ్రావతి, బ్యాంక్ గోల్డ్ తనిఖీ అధికారి శ్రీనివాస్ చారి,(ఎప్రైజర్) బ్యాంక్ మేనేజర్ స్నేహితుడు సుబ్రమణ్యం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు కామారెడ్డికి చెందిన యాదం అనిల్ పరారీలో ఉండగా, ఆయన భార్య స్రవంతి,బ్యాంక్ గోల్డ్ తనిఖీ అధికారి, (ఎప్రైజర్) శ్రీనివాస్ చారి,మేనేజర్ అనిల్ స్నేహితుడు సుబ్రమణ్యంను మంగళ వారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ మహేష్‌లు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

కీలక సూత్రదారులు..

మెదక్ పట్టణంలో ఆదర్శ కోపరేటీవ్ అర్బన్ బ్యాంకు మెదక్ బ్రాంచ్‌లో Rs 179.54 లక్షల మోసం కేసులో ముగ్గురు నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రదాన నిందితుడు యాదం అనిల్ మెదక్ ఆదర్శ కోపరేటీవ్ అర్బన్ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తూ అతని బార్య, స్నేహుతులు మరియు ఇతరుల adhar, PAN card లు తీసుకుని ఆ పేపెర్ల మీద నకిలీ బంగారం పెట్టి పెద్ద మొత్తంలో లోన్ లు తీసుకోవడం జరిగింది. అలాగే 2 ATM ల నుండినగదుని డిపాజిట్ చేసేటపుడు కొంత కొంత డబ్బులు పక్కన పెట్టి అలా సుమారు 31.35 లక్షలు నగదు ని కూడా మోస పూరితంగా బ్యాంకు ని మోసం చేసి వాడుకున్నాడు. 2 వ నిందితుడు శ్రీనివాస చారి నకిలీ బంగారంని తనికి చేసి, ఒరిజినల్ అని చెప్పి బ్యాంకుని మోసం చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు. 3వ నిందితుడు సుబ్రమణ్యం మేనేజర్ యాదం అనిల్ కి స్నేహితుడు. యాదం అనిల్, సుబ్రహ్మణ్యం& అతని బార్య ల యొక్క adhar, PAN card లు వాడుకుని నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకుని ఇద్దరు వాడుకున్నారు. 4 వ నిందితురాలు యాదం స్రవంతి యాదం అనిల్ యొక్క బార్య. యాదం అనిల్ స్రవంతి యొక్క adhar, PAN card లు వాడుకుని నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకుని ఇద్దరు వాడుకున్నారు.

Also Read: జోగిపేటలో చడ్డీ గ్యాంగ్ హల్చల్.. బస్సుల్లో డిజిల్ చోరీ!

పరారీలో అనిల్..

గతంలో కూడా యాదం అనిల్ ఆంధ్రప్రదేశ్ వెలిపాడు P.S పరిదిలో కూడా A.P. గ్రామీణ వికాస్ బ్యాంక్, Velairpadu మండల్ బ్రాంచ్ లో కూడా పోలవరం నిర్వాసితులని & గిరిజనులను మోసం చేసి Rs. 11,82,487/- డబ్బులు వాడుకుని జైలు కి పోయినాడనీ డీఎస్పీ ప్రసన్నకుమార్ చెప్పారు.ప్రస్తుతం యాదం అనిల్ పరారిలో ఉన్నాడు. మిగిలిన 3 నిందితులను అరెస్ట్ చేసి కోర్టు నందు హాజరు పరచడం జరిగింది. ఈ కేసులో 16 అకౌంట్లను పరిశీలించి దర్యాప్తు చేయనున్నట్లు డి.ఎస్.పి ప్రసన్న కుమార్, సి ఐ మహేష్ లు వెల్లడించారు. ఆదర్శ్ కోపరేటీవ్ అర్బన్ బ్యాంక్ సి ఇ ఓ వెంకట రమణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.

Also read: దత్తత పాప నవ్వులు.. దంపతుల కళ్లలో ఆనంద బాష్పాలు.. కలెక్టరేట్‌లో సందడి!

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×