E-Paper
Advertisement

Hero Nani: బ్లడీ రోమియోగా హీరో నాని.. అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేస్తూ!

Hero Nani: బ్లడీ రోమియోగా హీరో నాని.. అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేస్తూ!
Advertisement

Hero Nani:నేచురల్ స్టార్ నాని (Nani) ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సుజీత్ (Sujith) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈరోజు నాని బర్తడే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఒక స్పెషల్ వీడియోతో అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సుజీత్ – నాని కాంబోలో తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నాని బర్తడే సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. రిలీజ్ చేసిన ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నాని బర్తడే సర్ప్రైజ్.. బ్లడీ రోమియో నుండి టైటిల్ గ్లింప్స్..

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ వీడియో యానిమేషన్ రూపంలో విడుదల చేశారు. స్టైలిష్ డార్క్ క్రైమ్ కామెడీగా వస్తున్న ఈ చిత్రంలో నాని చెఫ్, గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియో అభిమానులలో హైప్ పెంచేసింది. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ తో పాటు నాని సొంత బ్యానర్ అయిన యునానిమస్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. వెన్నెల కిషోర్ వాయిస్ తో.. “చిటికెడు కరుణ. పిడికెడు కోపం.. బారెడు బీభత్సం.. మతిపోయేంత ప్రేమ” అనే డైలాగ్స్ తో.. హీరో క్యారెక్టర్ ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఇందులో నాని ఒకవైపు చెఫ్ గా కనిపించడమే కాకుండా.. గ్యాంగ్ స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా మెప్పించనున్నట్లు సమాచారం. మొత్తానికైతే నాని పుట్టినరోజు సందర్భంగా బ్లడీ రోమియో నుండి విడుదల చేసిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సుజిత్ డైరెక్షన్లో రాబోయే ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

మాస్ ప్రాజెక్టుతో పాటు స్టైలిష్ క్రైమ్ ఎంటర్టైనర్

Advertisement

ఇదిలా ఉండగా నాని సుజీత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఓజీ యూనివర్సిటీలో భాగం అని కామెంట్లు వ్యక్తం చేశారు. కానీ తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ గ్లింప్స్ చూస్తుంటే..’రన్ రాజా రన్’ తరహాలో స్టైలిష్ ట్రీట్ ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇందులో హీరోయిన్గా త్రిప్తి డిమ్రి, పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్త వినిపిస్తోంది. ఇకపోతే ఈ సమ్మర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తాజా గ్లింప్స్ లో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఒకవైపు ది ప్యారడైజ్ వంటి మాస్ ప్రాజెక్టులో చేస్తూనే.. మరొకవైపు బ్లడీ రోమియో వంటి స్టైలిష్ క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రాలతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అయిపోయారు నాని. మరి నాని ఈ సినిమాలతో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

also read:HBD Nani: నాని బర్తడే స్పెషల్..అసలు పేరేంటి.. ఈ క్రేజ్ వెనుక అంత కష్టం దాగుందా?

Advertisement

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×