E-Paper
Advertisement

AI Deepfake Scams: డేంజర్ బెల్స్.. ఏఐ బయోమెట్రిక్​ మోసాలకు తెరలేపిన సైబర్ క్రిమినల్స్!

AI Deepfake Scams: డేంజర్ బెల్స్.. ఏఐ బయోమెట్రిక్​ మోసాలకు తెరలేపిన సైబర్ క్రిమినల్స్!
Advertisement

AI Deepfake Scams: విస్తృత అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్న సైబర్ క్రిమినల్స్ నేరాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏఐ ఆధారిత బయో మెట్రిక్​ మోసాలకు తెర లేపారు. చిన్న సాయం కావాలి అని మాట కలిపి అవతలి వారి ఐడెంటిటీని తస్కరిస్తున్నారు. ఆ తరువాత డీప్​ ఫేక్​ వీడియోలు, ఆడియోలు సృష్టించి డబ్బు గుంజుతున్నారు. ఇన్వెస్ట్ మెంట్, పార్ట్ టైం జాబ్​ ఇలా రకరకాలుగా జనాన్ని ఉచ్ఛులోకి లాగుతున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ఏఐ ఆధారిత బయో మెట్రిక్ మోసాలను మొదలు పెట్టారు.

తెలియదని చెప్పి..

దీంట్లో భాగంగా రద్ధీ ఎక్కువగా ఉండే షాపింగ్ మాళ్లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్ల వంటి ప్రాంతాల్లో వృద్ధులుగా..సెల్​ ఫోన్​ గురించి ఏమీ తెలియని వారిలా నటిస్తూ టార్గెట్ గా చేసుకున్న వారిని తమ వలలోకి లాగుతున్నారు. మొబైల్ ఫోన్​ ను ఎలా ఉపయోగించాలో పూర్తిగా తెలియదని చెప్పి పెన్షన్​ స్టేటస్​ చూడమని, ఏదైనా యాప్​ ను సరి చేసి సాయం చేయాలని అడుగుతున్నారు. నిజమే అనుకుని అవతలి వారు ఫోన్​ చేతుల్లోకి తీసుకుని అడిగిన సహాయం చేస్తుండగా మాట్లాడటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అప్పటికే ఆ ఫోన్ లో వీడియో కాల్, స్క్రీన్ రికార్డింగ్ ను ఆన్​ చేసి పెడుతున్నారు. దీనివల్ల ఒక్కసారి ఆ ఫోన్ తీసుకుని పెన్షన్​ స్టేటస్​ చెక్​ చేసినా.. యాప్ ను సరిచేయాలని చూసినా అవతలి వారి ముఖం, వాయిస్​ రికార్డ్ అవుతోంది. ఆ తరువాత కొన్ని నిమిషాలకే సైబర్​ క్రిమినల్స్​ అవతలి వారి బయో మెట్రిక్​ డేటాను సేకరించి ఏఐ సహాయంతో అచ్చం వారిలా నటించే డీప్​ ఫేక్ వీడియోలు, ఆడియోలు సృష్టిస్తున్నారు. వీటిని అడ్డం పెట్టుకుని డబ్బు గుంజుతున్నారు.

Advertisement

Also Read: Low Haemoglobin: రక్త హీనతతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ 6 చిట్కాలతో హిమోగ్లోబిన్ పెంచుకోండి!

అలర్ట్ గా ఉండాలి..

ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ప్రతీ ఒక్కరూ అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ సైబర్​ క్రైం డీసీపీ అరవింద్ బాబు చెప్పారు. సాయం అంటూ దగ్గరకు వచ్చే అపరిచితుల మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దని సూచించారు. తెలియని వీడియో కాల్స్​ వైపు చూడవద్దన్నారు. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే సూచనలను పాటించ వద్దన్నారు. జాగ్రత్తలు తీసుకున్నా మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. దాంతోపాటు www.cybercrime.gov.in కు కూడా కంప్లయింట్ ఇవ్వొచ్చన్నారు. తాజా సమాచారం కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, https://www.instagram.com/cybercrimepshyd, ఎక్స్ ఖాతాతోపాటు https://x.com/CyberCrimeshyd/, యూ ట్యూబ్ ఛానల్​ www.youtube.com/@cybercrimespshydను సందర్శించాలన్నారు.

Advertisement

Also Read: AC – Fridge: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×