E-Paper
Advertisement

Pawan kalyan On Tirumala Ghee Case: కల్తీ నెయ్యి కేసు.. దోషులకు శిక్ష పడాల్సిందే, అసెంబ్లీలో పవన్

Pawan kalyan On Tirumala Ghee Case: కల్తీ నెయ్యి కేసు.. దోషులకు శిక్ష పడాల్సిందే, అసెంబ్లీలో పవన్
Advertisement

Pawan kalyan On Tirumala Ghee Case: సనాతన బోర్డు ఉండాలని తాను కొంతకాలంగా చెబుతున్నారని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తిరుమల లడ్డూలో నెయ్యి లేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో మంగళవారం తిరుమల లడ్డూ లో కల్తీ నెయ్యిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీ చర్చ

Advertisement

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పటి టీటీడీ పాలక మండలి నిర్వహణ పూర్తిగా విఫలమైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తాను ఎక్కడా గత ప్రభుత్వాధినేత ప్రమేయం ఉందని చెప్పలేదన్నారు. తప్పు జరిగిందని ఒకప్పుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెబితే సరిపోయేదన్నారు. అసలు నెయ్యి కల్తీయే జరగలేదని వైసీపీ నేతలు చెప్పడం ఏంటని సూటిగా ప్రశ్నించారు.

ప్రసాదంలో క్వాలిటీ లేదన్న విమర్శలు గతంలో చాలా వచ్చాయన్నారు. పశ్చాతాపంతోనే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టానని తెలిపారు. తిరుమల లడ్డూను కల్తీ చేశారన్నది వాస్తవమన్నారు. వాళ్లు నియమించిన బోర్డు నేతృత్వంలో ఇదంతా జరిగిందన్నారు.  ఈ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టిందన్నారు డిప్యూటీ సీఎం.

Advertisement

నెయ్యి తయారీకి ఒక్క లీటరు పాలు ఉపయోగించలేదని తేల్చి చెప్పిందన్నారు. పామాయిల్ లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు తేల్చిందన్నారు. ఆ రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారు అయ్యాయో నిర్థారించే సాంకేతికత మా వద్ద లేదని సిట్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.

దోషులకు శిక్ష పడాల్సిందేనన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఈ కేసులో 36 మందిని నిందితులుగా సిట్ ప్రస్తావించిందని గుర్తు చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర చేసినట్టు సిట్ తేల్చిందన్నారు. నచ్చిన సంస్థలు నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ నిబంధనలను సవరించినట్టు తెలిపారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు వార్షిక టర్నోవర్ రూ. 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించిందన్నారు.

రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనను సైతం తొలగించారని వివరించారు. డైయిరీ రంగంలో మూడేళ్లు అనుభవం ఉండాలన్న నిబంధనలను ఏడాదికి కుదించారని తెలియజేశారు. ఒకరికి నెయ్యి కాంట్రాక్టు ఇవ్వాలంటే ఈ నిబంధనలకు తూట్లు పొడిచారన్నారు. 2019-24 మధ్యకాలంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు అయ్యాయిని చెప్పుకొచ్చారు.

ALSO READ: డోర్ డెలివరీ నిందితుల కోసం వెతుకుతున్నాం-మంత్రి అనిత

టీటీడీ పాత బోర్డును జగన్ ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కల్తీ నెయ్యి కేసులో దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనన్నారు. కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు ఉన్నాయో ఆ పెరుమాళ్లకే తెలియాలన్నారు. జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పిందన్నారు.

ఆ నెయ్యి నెయ్యేకాదని సీబీఐ రిపోర్టు తేల్చి చెప్పిందన్నారు. ఇది ధర్మానికి సంబంధించిన విషయమని, వెంకటేశ్వరుడికి కాకుండా వేరే ఏ మతానికి జరిగినా దేశం గగ్గోలు అయ్యేదన్నారు. సకల మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి అని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

 

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×