E-Paper
Advertisement

The Paradise : వెనక్కు తగ్గిపోయిన మరో సుకుమార్ శిష్యుడు, పెద్ది సినిమాకు లైన్ క్లియర్

The Paradise : వెనక్కు తగ్గిపోయిన మరో సుకుమార్ శిష్యుడు, పెద్ది సినిమాకు లైన్ క్లియర్
Advertisement

The Paradise : దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు దర్శకులుగా మారుతున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని సుకుమార్ ప్రూవ్ చేశాడు.

ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న పారడైజ్, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది. ఈ రెండు సినిమాలు పై కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలను కూడా మార్చి 26, 27 తారీకులలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కన్ఫామ్ పెద్ది 

Advertisement

మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే పెద్ది సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ కు తీసుకురావలసిందిగా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ డేట్ కంటే ముందుగానే విడుదల కానుంది. మార్చ్ 25న పలుచోట్ల ప్రీమియర్స్ వేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయమైన సినిమా దసరా. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దర్శకుడుగా మొదటి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు శ్రీకాంత్. మళ్లీ నాని హీరోగా పారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. మార్చి 26న విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ జరుగుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

మార్చి నుంచి మే 

Advertisement

ఈ సినిమా మార్చి 26న విడుదల చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే మార్చి 26వ తారీకు నుంచి ఈ సినిమా మే నెలకు పోస్ట్ పోన్ జరుగుతుంది. కొన్ని పనులు ఇంకా పూర్తిస్థాయిలో పెండింగ్ ఉండటం వలనే మార్చి 26 కు ఈ సినిమా తీసుకురాలేము అని గ్రహించి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి కి కూడా విపరీతమైన అభిమాని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక అభిమాని తన అభిమాని హీరోను ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా విషయంలో కూడా అదే అనిపిస్తుంది.

Also Read: Ram Pothineni : తమిళ్ డైరెక్టర్ తో రామ్ పోతినేని, కే వీ ఎన్ ప్రొడక్షన్స్ లో ఊహించని కాంబినేషన్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×