E-Paper
Advertisement

Surender Reddy : పవన్ కళ్యాణ్ కోసం రెండు పవర్ఫుల్ స్క్రిప్ట్స్, రంగంలోకి దిగిన వక్కంతం వంశీ

Surender Reddy : పవన్ కళ్యాణ్ కోసం రెండు పవర్ఫుల్ స్క్రిప్ట్స్, రంగంలోకి దిగిన వక్కంతం వంశీ
Advertisement

Surender Reddy : అతనొక్కడే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కమర్షియల్ డైరెక్టర్ దొరికాడు అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా కూడా దర్శకుడుగా సురేందర్ రెడ్డి ఫెయిల్ కాలేదు. వక్కంతం వంశీ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. రచయిత వక్కంతం వంశీ కథలను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుంటాడు.

వీరి కాంబినేషన్లో వచ్చిన కిక్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అలానే రేసుగుర్రం సినిమా మొదటి షో పడగానే విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. ఒక గన్ చూపిస్తూ యద్భావం తద్భవతి అంటూ కొటేషన్ కూడా రాశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా ఆగిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన అన్ని ప్రాజెక్టులు కూడా దాదాపు పూర్తి చేసేశారు. ఆ ప్రాజెక్టు గురించి అసలు టాపిక్ రాలేదు.

రెండు పవర్ఫుల్ స్క్రిప్ట్ లు 

Advertisement

చాలామంది రచయితలుగా తెలియదు మొదలుపెట్టి నేడు దర్శకులుగా మారిపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి దర్శకులు రచయితలుగా కెరియర్ మొదలుపెట్టి ఈ రోజు స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు. మరోవైపు వక్కంతం వంశీ కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడుగా మారాడు. అల్లు అర్జున్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత చాలా రోజుల వరకు ఇంకో సినిమాకి దర్శకత్వం చేయలేదు. మొత్తానికి నితిన్ హీరోగా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అని ఈ సినిమాకి ప్రశంసలు వచ్చాయని కమర్షియల్ సక్సెస్ కాలేదు.

Advertisement

ఇకపోతే వంశీ తనలోని రైటర్ ను మరోసారి ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా రెండు పవర్ఫుల్ స్క్రిప్ట్ లు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా వీళ్లకు తెలుసు కాబట్టి త్వరలోనే ఈ కథలను చెప్పే అవకాశం ఉంది.

పవన్ డెసిషన్ ఏంటి 

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయను అని అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ మళ్లీ సురేందర్ రెడ్డితో సినిమా చేస్తారా, లేకపోతే కమిట్మెంట్ నిర్మాతకు ఇచ్చారు కాబట్టి రామ్ తల్లూరితో చెప్పి కాంప్రమైజ్ అవుతారా అనేది ఇప్పుడు వస్తున్న అనుమానం.

మరోవైపు ఓ జి సీక్వెల్ కూడా చేయబోతున్నట్లు పవన్ పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు. మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఏదైనా పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించినంతవరకు దీని గురించి క్లారిటీ రాదు.

Also Read: The Paradise : వెనక్కు తగ్గిపోయిన మరో సుకుమార్ శిష్యుడు, పెద్ది సినిమాకు లైన్ క్లియర్

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×