E-Paper
Advertisement

Ram Pothineni : తమిళ్ డైరెక్టర్ తో రామ్ పోతినేని, కే వీ ఎన్ ప్రొడక్షన్స్ లో ఊహించని కాంబినేషన్

Ram Pothineni : తమిళ్ డైరెక్టర్ తో రామ్ పోతినేని, కే వీ ఎన్ ప్రొడక్షన్స్ లో ఊహించని కాంబినేషన్
Advertisement

Ram Pothineni : దేవదాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తన కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేశాడు. రీసెంట్ టైమ్స్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఒక సక్సెస్ కొట్టడానికి రామ్ కి చాలా రోజులు పట్టేసింది. సినిమాలు ఫెయిల్ అయ్యాయి కానీ రామ్ మాత్రం ఎక్కడా ఫెయిల్ కాలేదు. 100% సినిమా కోసం తన ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు. కానీ కథలు ఎన్నుకునే విషయంలో ఎక్కడో తడబడ్డాడు అని అతని స్టోరీ సెలక్షన్ చూస్తే అర్ధమైపోతుంది.

రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నవంబర్ 27న విడుదలైంది. ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చినా కూడా చాలాచోట్ల సినిమాకి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ అందడం లేదు. ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు అని అందరూ ఊహించరు. కానీ ఈ సినిమా కూడా అంతంత మాత్రమే రెస్పాన్స్ సాధించుకుంటుంది.

మరో తమిళ దర్శకుడు తో 

Advertisement

రామ్ చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగాడు కాబట్టి తనకి విపరీతంగా తమిళ్ వస్తుంది. అలానే తమిళ్ దర్శకులతో కూడా పనిచేయడానికి ఇష్టపడతాడు. తన షార్ట్ ఫిలిం కూడా తమిళ్లోనే చేశాడు రామ్. అది చూసి దర్శకనిర్మాత వైవిఎస్ చౌదరి రామ్ ను దేవదాస్ సినిమాతో లాంచ్ చేశాడు.

లింగు స్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ది వారియర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించక పోయినా కూడా కొంతమందిని ఆకట్టుకోవడం జరుగుతుంది. కానీ ఆ సినిమా కనీసం అది కూడా చేయలేదు.

Advertisement

రామ్ పోతినేని ఇప్పుడు మరో తమిళ దర్శకుడు తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్ లో సముద్ర కని దర్శకుడుగా రామ్ పోతినేని హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ లో ఊహించని కాంబినేషన్ 

కేవీఎన్ ప్రొడక్షన్స్ పేరు గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ డేట్స్ ఈ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఉన్నాయని. ఇక్కడే పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ ఈ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయనున్నారని పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలతో ఈ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

ఈ తరుణంలో రామ్ సినిమా అనేది ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా వస్తే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది అని కొంతమంది అంచనా వేస్తున్నారు.

Also Read : Venu Udugula : ప్రొడ్యూసర్ దొరికినంతవరకు శ్రీ విష్ణు శాలరీ ఇచ్చాడు, ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం

Related News

పెళ్లిరోజే విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

ముగింపు ఎప్పుడు.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడే విచారణ!

రీరిలీజ్ కి సిద్ధమైన పవర్ స్టార్ మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ మూవీ.. ఎప్పుడంటే?

చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!

AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

మీరు ఆట మొదలుపెట్టారు.. ముగింపు ప్రజలే ఇస్తారు.. మరో సంచలన వీడియోతో ప్రకాష్ రాజ్!

Producer : సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

“అయ్యగారు అఖిల్”కి అభిమాని కొత్త పేరు.. భలే ఉందే!

Big Stories

Advertisement
×