E-Paper
Advertisement

The Paradise: ‘ద ప్యారడైజ్’ నుంచి బిగ్ అప్డేట్.. నాని బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్..

The Paradise: ‘ద ప్యారడైజ్’ నుంచి బిగ్ అప్డేట్.. నాని బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్..
Advertisement

The Paradise: నాచురల్ స్టార్ నాని అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త. ‘దసరా’ వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ద ప్యారడైజ్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకుని, ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి ‘ఆయా షేర్’ (AayaSher) పేరుతో ఒక ప్రత్యేక వీడియో లేదా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వెలువడింది. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఈ సినిమాలో అంతకు మించి ఉండబోతుందని ఈ అప్‌డేట్ సూచిస్తోంది.

Read also-Uday Kiran: ఉదయ్ కిరణ్ భార్య చేసిన త్యాగం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

ఆగస్టు 21న రిలీజ్

Advertisement

ఈ సినిమా విడుదలకు సంబంధించి కూడా మేకర్స్ స్పష్టతనిచ్చారు. ఆగస్టు 21, 2026న ‘జడల్ జమానా’ (Jadal Zamana) పేరుతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని కేవలం సౌత్ భాషలకే పరిమితం చేయకుండా, ఏకంగా 8 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం అనిరుధ్ ఇచ్చే మ్యూజిక్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్తోంది. నాని ఎనర్జీకి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇప్పుడు ‘ద ప్యారడైజ్’తో అంతకు మించిన వైలెన్స్, ఎమోషన్, డ్రామాను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 24న రాబోయే టీజర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read also-Mancherial Crime: ప్రేమ పెళ్లిలో చిచ్చు.. భర్తని పొడిచి పొడిచి చంపిన భార్య, మంచిర్యాల జిల్లాలో దారుణం

Advertisement

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×