E-Paper
Advertisement

Mancherial Crime: ప్రేమ పెళ్లిలో చిచ్చు.. భర్తని పొడిచి పొడిచి చంపిన భార్య, మంచిర్యాల జిల్లాలో దారుణం

Mancherial Crime: ప్రేమ పెళ్లిలో చిచ్చు.. భర్తని పొడిచి పొడిచి చంపిన భార్య,  మంచిర్యాల జిల్లాలో దారుణం
Advertisement

Mancherial Crime: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. మొదట్లో అంతా సజావుగా సాగింది. రాను రాను భార్యాభర్తల మధ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఆవేశానికి లోనైంది. చివరకు భర్తని కత్తితో  పొడిచి పొడిచి చంపేసింది భార్య. సంచలనం రేపిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది.

మంచిర్యాల జిల్లాలో దారుణం.. ప్రేమ పెళ్లిలో చిచ్చు

Advertisement

మంచిర్యాల జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మందమర్రి పట్టణంలో శాంతి నగర్‌‌లో నివాసం ఉంటున్నారు మొయిన్-అవంతి దంపతులు. వీరిద్దరు ప్రేమించుకున్నారు, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ వివాహం కావడంతో పెళ్లయిన కొత్తలో అంతా సజావుగా సాగింది. ఇబ్బందులున్నా భార్యభర్తల సమస్యని తెలుసుకుని సర్దుకుపోయేవారు.

బాగానే సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి.  అయితే సోమవారం రాత్రి భార్యాభర్తల మాటా మాటా చోటు చేసుకుంది. చివరకు గాలివానగా మారింది. భార్యభర్తల ఆవేశానికి దారి తీసింది. నువ్వెంత అంటే.. నువ్వెంత అనే స్థాయికి చేరింది. పట్టరాని కోపంతో అవంతి.. ఇంట్లోని కత్తి తీసుకుని భర్త మొయిన్ పై విచక్షణా రహితంగా దాడి చేసింది.

Advertisement

భర్తని పొడిచి పొడిచి చంపిన భార్య, ఆపై పోలీసుల చేతికి

పలుమార్లు కత్తితో పొడిచింది. భార్యభర్తల మధ్య ఘర్షణను గమనించిన ఇరుగుపొరుగువారు రక్తస్రావమైన మొయిన్‌ని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మొయిన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి నిందితురాలు నుంచి కీలక సమాచారం సేకరించారు. భర్త వేధింపుల వల్ల హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అవంతికను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ALSO READ: దొంగతనంలో ఫాస్ట్ ట్రాక్.. బీరువానే ముద్దు అనుకున్న వింత దొంగలు!

మొయిన్-అవంతిది ప్రేమ వివాహమని తేలింది. వివాహం దగ్గర నుంచి మొయిన్ తరచూ తనను వేధించేవాడని తేలింది. ఆ బాధ భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతుడి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×