The Paradise Release Update: నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. నాని కెరియర్ లోనే మొదటిసారి అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ సినిమా ఎనిమిది భాషలలో ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని ఎస్ఎల్వి సినిమా బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ చిత్ర బృందం గతంలో అధికారకంగా వెల్లడించారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో సరైన స్పష్టత లేని నేపథ్యంలో అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాని మార్చ్ 26వ తేదీ విడుదల చేయబోతున్నారు అంటూ గతంలో చిత్ర బృందం వెల్లడించినప్పటికీ ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి నుంచి వాయిదా పడుతూ వేసవి సెలవులలో అనగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. మార్చి నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుంది. అదేవిధంగా ఈ సినిమా పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తికాని నేపథ్యంలోనే వాయిదా వేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.
ఇలా ఈ సినిమా విడుదల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఈ విషయంపై సరైన స్పష్టత వెల్లడించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమా సికింద్రాబాద్లోని గత యుగం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో నాని తల్లి పాత్రలో సీనియర్ నటి సోనాలి కులకర్ణి నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ సందడి చేయబోతున్నారు. ఇలా ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ గా రాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాతగా కూడా సక్సెస్..
ఇక నాని చివరిగా హిట్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదివరకు నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో మరోసారి ది ప్యారడైజ్ సినిమా అవకాశం ఇవ్వడమే కాకుండా నాని నిర్మాణంలో శ్రీకాంత్ డైరెక్షన్ లో చిరంజీవితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
Also Read: Vijay Rashmika Marriage: విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి ‘ డచ్ గులాబీలు’.. పెళ్లి పనులు మొదలు!