E-Paper
Advertisement

Davos-2026: దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ విజన్-2047 ప్రదర్శన

Davos-2026: దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ విజన్-2047 ప్రదర్శన
Advertisement

Davos-2026: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా చిరంజీవితో కలిసి ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి

Advertisement

దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుపై తెలంగాణ తన సత్తా చాటుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల టీమ్ దావోస్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. అంతేకాకుండా తెలంగాణ భవిష్యత్తును ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది.

ప్రస్తుతం జ్యూరిచ్‌లో పర్యటిస్తున్నారు నటుడు చిరంజీవి.  కుటుంబసభ్యులంతా అక్కడికి వచ్చారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలియడంతో ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానంతో దావోస్ సదస్సుకు హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్- 2047’ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ అభివృద్ధిపై తన మద్దతు ప్రకటించారు.

Advertisement

‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శన

సీఎం రేవంత్‌‌రెడ్డితో కలిసి చిరంజీవి పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో వివిధ అంశాలపై చర్చించారు. కుటుంబ సభ్యులతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను వీక్షించానని, ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవితో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా కలుసుకున్న ఇరువురు ఆనందంగా గడిపారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు ప్రతి జులైలో హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు.  ఈ ప్రతిపాదనకు ప్రపంచ వ్యాపార వేత్తల నుండి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందన్నారు.

ALSO READ: ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ జీసీసీ హైదరాబాద్‌లో.. నవంబర్‌లో ప్రారంభం

దాదాపు రూ. 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. దావోస్‌ వేదికగా వ్యాపారవేత్తలతో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ విజయవంతం తర్వాత మా దార్శనికత, విధానాలను ప్రదర్శించడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×