E-Paper
Advertisement

నాని ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ అప్డేట్..ఈసారి లవ్ లో పడేయనున్న జడల్!

నాని ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ అప్డేట్..ఈసారి లవ్ లో పడేయనున్న జడల్!
Advertisement

The Paradise: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ టు హీరోగా కొనసాగుతున్న నాని బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు నిర్మాతగా వరుస సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకుంటున్న ఈయన, హీరోగా కూడా పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)దర్శకత్వంలో ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

సెకండ్ సింగిల్ అప్డేట్..

దసరా సినిమా ద్వారా డైరెక్టర్ శ్రీకాంత్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయవంతం కావడంతో తదుపరి నాని ప్యారడైజ్ సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమా  ఆగస్టు 21వ తేదీ ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్ర బృందం గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటించారు. నిజానికి ఈ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తూనే మరోవైపు సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు.

ప్యారడైజ్ నుంచి లవ్ సాంగ్..

Advertisement

ఈ సినిమా నుంచి ఇదివరకే ఆయా షేర్ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ లభించడమే కాకుండా సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇలా ఆయా షేర్ పాటకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈసారి లవ్ సాంగ్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ పాటను మే 10 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది.

నాని తల్లిగా సోనాలి కులకర్ణి..

Advertisement

ఇక ఈ సినిమాలో నాని జడల్ అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం నాని జోడిగా ఖయాదు లోహర్ ఈ సినిమాలో నటించబోతున్నారు. నాని తల్లి పాత్రలో సీనియర్ నటి సోనాలి కులకర్ణి సందడి చేయనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. మరి అనుకున్న విధంగానే ఆగస్టు 21వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదంటే మరోసారి వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఏడాది డిసెంబర్లో విడుదల కాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం ఎక్కడ అధికారికంగా స్పందించలేదు.

Also Read: ‘బరి’ పూర్తికాకుండానే మరో సినిమాని లైన్ లో పెట్టిన నిహారిక..మెగా డాటర్ స్పీడ్ మామూలుగా లేదే!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×