E-Paper
Advertisement

Nari Nari Naduma Murari OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న నారి నారి నడుమ మురారి.. ఎప్పటినుంచంటే..!

Nari Nari Naduma Murari OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న నారి నారి నడుమ మురారి.. ఎప్పటినుంచంటే..!
Advertisement

Nari Nari Naduma Murari OTT: సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వినోదాన్ని అందించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం..నారీ నారీ నడుమ మురారి. థియేటర్లలో నవ్వులతో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

జనవరి 14న సంక్రాంతి బరిలోకి చివరిగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు సినిమా ప్రధాన.. బలంగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయినవారికి ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Advertisement

ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటించగా.. ఇద్దరు హీరోయిన్లుగా సాక్షి వైద్య, సంయుక్త కనిపించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా శర్వానంద్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. సీనియర్ నటుడు నరేశ్, అలాగే సత్య, సునీల్, వెన్నెల కిశోర్ తమ సహజమైన కామెడీతో సినిమాకు మంచి ప్లస్ అయ్యారు. దర్శకుడు రామ్ అబ్బరాజు వినోదాత్మక కథను ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే, గౌతమ్ అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. గౌతమ్ బీటెక్ పూర్తి చేసి ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుంటాడు. అతను నిత్య అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. మొదట నిత్య తండ్రి రామలింగం ఈ పెళ్లికి ఒప్పుకోడు. తర్వాత కొన్ని షరతులతో అంగీకరిస్తాడు. పెళ్లి తప్పనిసరిగా రిజిస్టర్ ఆఫీస్‌లో జరగాలని చెబుతాడు.

Advertisement

అలా పెళ్లి కోసం దరఖాస్తు చేసిన తర్వాత గౌతమ్ జీవితంలో అనుకోని సమస్య ఎదురవుతుంది. అతని కాలేజ్ రోజుల ప్రేమ అయిన దియా మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది. దియా – గౌతమ్ మధ్య గతంలో ఏం జరిగింది? వాళ్లు ఎందుకు విడిపోయారు? ఈ రెండు ప్రేమకథలు గౌతమ్ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? ముఖ్యంగా గౌతమ్ తండ్రి కార్తీక్, పిన్ని పల్లవి మధ్య దాంపత్య జీవితం ఎందుకు సమస్యల్లో పడింది? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

కామెడీతో పాటు భావోద్వేగాల మిశ్రమంగా తెరకెక్కిన ఈ సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉండటంతో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. థియేటర్లలో నవ్వించిన ‘నారీ నారీ నడుమ మురారి ఇప్పుడు ఓటీటీలో కూడా అదే వినోదాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇంట్లో కూర్చొని నవ్వులు పూయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

ALSO READ: MSG OTT Release: ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×