E-Paper
Advertisement

MSG OTT Release: ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

MSG OTT Release: ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Advertisement

MSG OTT Release:మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ ‘మన శంకర వర ప్రసాద్’ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంక్రాంతికి విడుదలై, ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వును పంచిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు మేనరిజమ్స్ తోడవ్వడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన వారికి, మళ్ళీ చూడాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త..మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం..

ఇండస్ట్రీ హిట్‌గా మన శంకర వర ప్రసాద్:

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వర ప్రసాద్’ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లను సాధించింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి, ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్, నయనతార నటన ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా సందడి కొనసాగుతున్నప్పటికీ, ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ బొమ్మ డిజిటల్ తెరపైకి వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ALSO READ:Sharwanand NNNM Movie: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన శర్వానంద్ కొత్త మూవీ.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ విడుదల తేదీ ఇదే:

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ మెగా బ్లాక్ బస్టర్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ZEE5’లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11, 2026 నుండి ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని వార్తలు వస్తున్నాయి. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ఓటీటీలో కూడా కొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే కూర్చుని చిరు కామెడీని ఎంజాయ్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ ఇప్పటికే సిద్ధమైపోయారు. ఫిబ్రవరి రెండో వారంలో చిరు తన కామెడీ మేనియాతో మన ఇళ్లలోకి రాబోతున్నారన్నమాట.

Advertisement

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. సచిన్ ఖేడేకర్, క్యాథరిన్ థ్రేసా, మాస్టర్ రేవంత్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం తమ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి వినోదాన్ని పంచారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ముఖ్యంగా పాటలు , నేపథ్య సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. థియేటర్లలో హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలో దుమ్ముదులపటానికి వచ్చేస్తుంది. చిరంజీవి వింటేజ్ కామెడీని మరోసారి మన ముందుకు తెచ్చిన అనిల్ రావిపూడికి మెగా ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఫిబ్రవరి 11న ZEE 5 లో రాబోతున్న ఈ సినిమా డిజిటల్ రికార్డులను సైతం తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×