E-Paper
Advertisement

Naveen Polishetty: సింగర్‌గా మారిన నవీన్‌ పోలిశెట్టి.. అనగనగ ఒక రాజులో పాట పాడిన హీరో

Naveen Polishetty: సింగర్‌గా మారిన నవీన్‌ పోలిశెట్టి.. అనగనగ ఒక రాజులో పాట పాడిన హీరో
Advertisement

Naveen Polishetty: టాలీవుడ్‌ టాలెంటడ్‌ నటుడు, యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పాత్రలోతో ప్రమోగాలు చేస్తాడు. ఒకే జానర్‌కి పరిమితంగా కాకుండా కొత్త కొత్త జానర్స్‌తో ఆడియన్స్‌కి వినోదం అందిస్తుంటాడు. అతడి సినిమాలో కామెడీ ప్రాధాన్యం. కానీ, పాత్రలు, జానర్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. అనగనగా ఒక రాజు చిత్రంతో రాబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నవీన్‌ రాజు పాత్రలో అలరించబోతున్నాడు.

నవీన్ పాడిన పాట ఇదే

ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్‌ మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. అయితే ఈ సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా నవీన్‌ పోలిశెట్టి హీరోగానే కాదు సింగర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడట. ఈ సినిమాలో ఓ పాట పాడబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్ చేశారు. “స్టార్‌ ఎంటరైనర్‌ నవీన్‌ పోలిశెట్టి ప్లేబ్యాక్‌ సింగర్‌గా మారాడు. అతడు పాడిన మొదటి పాట భీమవరం బల్మా అంటూ సాగే ఈ పాట పాట నవంబర్‌ 27న విడుదల కాబోతుంది. ఈ పండగకి స్టెప్పులు వేయడానికి రెడీగా ఉండిండి” అంటూ ప్రకటన ఇచ్చారు. అలాగే మూవీ రిలీజ్‌ పై వస్తున్న పుకార్లకు కూడా ఈ సందర్భంగా మేకర్స్‌ ఫల్‌స్టాప్‌ పెట్టారు.

చెప్పిన డేట్ కే వస్తున్నాం

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ని జరుపుకుంటుంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగకు జనవరి 14న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. అయితే అనగనగ ఒక రాజు వాయిదా పడుతుందని, సంక్రాంతి బరి నుంచి రాజు తప్పుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ సినిమా వాయిదా పడిందనే రూమర్స్‌ ఊపందుకున్నాయి. తాజాగా ఈ వార్తలపై మూవీ టీం పరోక్షంగా స్పందింది. ఈ పండక్కే వస్తున్నామని, చిందులే వేసేందుకు సిద్ధంగా ఉండంటూ మూవీ రిలీజ్ పై డేట్‌పై స్పష్టత ఇచ్చింది మూవీ టీం. తాజాగా ఇచ్చిన ఈ అప్‌డేట్ సినిమాను జనవరి 14నే విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో అనగనగ ఒకరాజు వాయిదా పడే అవకాశం లేదని స్పష్టమైంది.

Also Read: Akash Puri: గొప్ప మనసు చాటుకున్న ఆకాశ్‌ పూరీ.. జోష్‌ రవిని పరామర్శించిన హీరో

సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ

Advertisement

కాగా ఈ సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి-అనిల్‌ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకరవరప్రసాద్‌ గారూ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ప్రభాస్ ది రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, విజయ్ జన నాయగన్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా క్యూలో ఉన్నాయి. ఈ పండగక్కి పెద్ద హీరోల సినిమాలు ఉండటంతో నవీన్‌ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను మేకర్స్‌ కొట్టిపారేసిన.. వాయిదా వేయక తప్పదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ బజ్‌ ప్రకారం మూవీ వాయిదా పడుతుందా? మూవీ టీం చెప్పినట్టుగానే పండగక్కి వస్తుందా తెలియాలంటే మరికొన్ని రాజులు ఆగాల్సిందే.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×