E-Paper
Advertisement

Ind vs SA, 2nd Test: ద‌క్షిణాఫ్రికా డిక్లేర్.. టీమిండియా ముందు కొండంత టార్గెట్‌..500ల‌కు పైగానే

Ind vs SA, 2nd Test: ద‌క్షిణాఫ్రికా డిక్లేర్.. టీమిండియా ముందు కొండంత టార్గెట్‌..500ల‌కు పైగానే

Ind vs SA, 2nd Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd Test) మధ్య రెండో టెస్టు గౌహతి ( Barsapara Cricket Stadium, Guwahati) వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి నుంచి దక్షిణాఫ్రికానే పై చేయి సాధిస్తుంది. సొంత గడ్డపై కూడా టీమ్ ఇండియా ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదు. అయితే తాజాగా రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా, 260 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దింతో సౌత్ ఆఫ్రికాకు 548 పరుగుల లీడ్ దక్కింది. అంటే మిగిలిన ఒకటిన్నర రోజులో టీమిండియా 549 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, మ‌నోళ్లు ఆ టార్గెట్ ఛేదిస్తేనే, టెస్ట్ సిరీస్ స‌మం అవుతుంది. అలా కాకుండా ఇందులో ఓడినా, మ్యాచ్ డ్రా చేసుకున్నా సిరీస్ ను 1-0 తేడాతో స‌ఫారీలు ఎగురేసుకు వెళ‌తారు.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

టీమిండియా ముందు కొండంత టార్గెట్‌..500ల‌కు పైగానే

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆదిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 201 పరుగులు చేసి చేతులెత్తేసింది. ఈ మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ ఒక్కడే బాగా రాణించాడు. అటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మెరుపులు మెరిపించాడు. మిగతా బ్యాటర్లు అందరూ కూడా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ కూడా చివరలో వికెట్ ఆపే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాటర్లు మాత్రం క్రీజులో నిలబడలేదు. దీంతో దక్షిణాఫ్రికాకు భారీగానే లీడ్ దక్కింది.

టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా తెలివిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది తెంబా బవుమా జట్టు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 78 ఓవర్లు ఆడిన నేపథ్యంలో స్టబ్స్ 94 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతను సెంచరీ మిస్ చేసుకోవడంతో డిక్లేర్ చేశారు. ఓవరాల్ గా టీమిండియా ముందు 549 పరుగుల భారీ టార్గెట్ వచ్చింది దక్షిణాఫ్రికా. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో కె ఎల్ రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇవాళ మరో గంట పాటు ఆట కొనసాగే ఛాన్స్ ఉంది. రేపు చివరి రోజు మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయితే, సిరీస్ దారుణంగా కోల్పోవడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కూడా టీమిండియా మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది.

Also Read: Smriti Mandhana Wedding: పలాష్ కు మరో అమ్మాయితో ఎఫైర్.. పెళ్ళి ఆపేందుకే స్మృతి తండ్రి గుండెపోటు డ్రామాలు?

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×