E-Paper
Advertisement

Naveen Polishetty : భారీ యాక్సిడెంట్.. ఏడాది పాటు అంటూ ఎమోషనల్ అయిన పొలిశెట్టి

Naveen Polishetty : భారీ యాక్సిడెంట్.. ఏడాది పాటు అంటూ ఎమోషనల్ అయిన పొలిశెట్టి
Advertisement

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు. భీమవరం బాల్మ అనే ఈ పాటను నవీన్ పోలిశెట్టి పాడారు. అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ భీమవరం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిపారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు ఎద్దుల బండి పైన ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి.

నటుడుగా కెరియర్ మొదలు పెట్టిన నవీన్ పోలిశెట్టి తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ తీసుకుని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి నవీన్ కి మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి హ్యాట్రిక్స్ సక్సెస్ తన ఖాతాలో వేసింది.

Advertisement

ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు నవీన్ ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి కారణాలేంటి అనేది పెద్దగా చాలామందికి తెలియదు. గతంలో తనకి యాక్సిడెంట్ జరిగింది అని నవీన్ చెప్పిన సంగతి తెలిసిందే మరోసారి దాని గురించి క్లారిటీ ఇచ్చాడు నవీన్.

నా జీవితంలో మేజర్ యాక్సిడెంట్ 

నా జీవితంలో మేజర్ యాక్సిడెంట్ జరగటం వలన ఒక సంవత్సరం పాటు నేను షూటింగ్స్ చేయలేకపోయాను. నా చెయ్యి విరిగిపోయింది. నా బ్యాక్ లో కొన్ని ఫ్యాక్చర్స్ జరిగాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అని చాలా టెన్షన్ పడ్డాను.

Advertisement

కానీ ఈరోజు మీ అందరి ఆన్లైన్ కామెంట్స్ చూసి, ఆఫ్లైన్ ప్రేమ చూసి. మళ్లీ షూటింగ్ కు వెళ్లి ఈ అనగనగా ఒక రాజు సినిమా చేశాను. ఇది ఒక కమర్షియల్ పండగ సినిమా. మీ ఎనర్జీ వాళ్ళనే నేను ఇక్కడ ఉన్నాను. అదే ఎనర్జీ వలన మీ అందరి కోసం ఈ సినిమాలో ఫస్ట్ టైం పాట పాడాను. అంటూ ఎమోషనల్ అయిపోయారు నవీన్ పోలిశెట్టి.

నవీన్ పోలిశెట్టి మార్క్ మిస్ అవలేదు 

మామూలుగా నవీన్ పోలిశెట్టి ఒక ఈవెంట్ లో ఉంటే దాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవీన్ ఉంటే యాంకర్ కూడా అవసరం లేదు సరిగ్గా నేడు జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కూడా అలానే జరిగింది. అందుకే యాంకర్ కూడా నవీన్ గారు నేను ఉన్నాను అంటూ నవీన్ కి గుర్తు చేశారు.

అలానే ఒక అభిమాని వచ్చి కాళ్ల పైన పడిపోయాడు. వెంటనే అతనిని దగ్గరకు పిలిచి అతనితో మాట్లాడి అతనికి ఫోటో ఇచ్చి తనదైన స్టైల్ లో రెస్పాండ్ అయ్యాడు నవీన్. ఇలాంటివన్నీ చూస్తుంటేనే నవీన్ చాలామంది విపరీతంగా ఇష్టపడతారు అని మరోసారి అర్థమవుతుంది.

Also Read: Naveen Polishetty : పాట రెడీగా ఉందా.. స్టార్ హీరోలు… నిర్మాతలపై నవీన్ సెటైర్లు

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×