E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 81 : తనూజా తన్మయత్వంలో యావర్… గేమ్ లో బొక్క బోర్లా పడ్డ ఇమ్మూ… సోహెల్ తో బిగ్ బాస్ ఆటలు

Bigg Boss 9 Telugu Day 81 : తనూజా తన్మయత్వంలో యావర్… గేమ్ లో బొక్క బోర్లా పడ్డ ఇమ్మూ… సోహెల్ తో బిగ్ బాస్ ఆటలు

Bigg Boss 9 Telugu Day 81 :బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీతో సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ లోకి ప్రేరణ, ప్రియాంక జైన్, మానస్ లు ఎంట్రీ ఇవ్వగా, తాజా ఎపిసోడ్ లో మరికొందరు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి, గేమ్స్ ఆడి అదరగొట్టారు.

తనూజా మాయలో యావర్

ముందుగా ఎక్స్ కంటెస్టెంట్, బిగ్ బాస్ తెలుగు 7 యావర్ వచ్చి హౌస్ లో రొమాంటిక్ వైబ్ తీసుకొచ్చాడు. వచ్చీ రాగానే “తనూజా కు లవర్ ఉన్నాడా?” అని ఆమెనే అడిగాడు. అలాగే ఇమ్మూ జుట్టుపై సెటైర్లు వేశాడు. తనూజాతో రొమాంటిక్ గా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అంతా అయ్యాక ‘సెట్ ద ఫైర్’ అనే టాస్క్ కు ఇమ్మూ ను సెలెక్ట్ చేసుకుని ఆడాడు. ముందున్న రోప్ మధ్యలో నుంచి దాటుకుంటూ, సంచులలో ఉన్న ఫైర్ ఫజిల్ ను తీసుకెళ్లి పేర్చాలి. ఇందులో ఇమ్మూ గెలిచాడు.

ఆయన వెళ్లిపోయాక అర్దరాత్రి తన ట్యాబ్లెట్స్ పోయాయని భరణి కెప్టెన్ రీతూకి కంప్లయింట్ చేశాడు. అంతేకాదు తీసిన వాళ్ళు ఇప్పుడే తెచ్చిస్తే మంచిది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో హౌస్ లో ప్రతి ఒక్కరినీ సంజనతో సహ దీని గురించి అడిగింది రీతూ. అయితే సంజన వాటిని తీయడం తాను చూశానని తనూజ చెప్పింది. కానీ సంజన మాత్రం ఒప్పుకోలేదు. చివరికి అర్దరాత్రి దాటాక మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని భరణిని అడిగింది కానీ ఆయన పొద్దున్నే మాట్లాడదాం అంటూ సైలెంట్ అయ్యాడు. అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చి కూడా మాట్లాడొచ్చు. ఈ టైమ్ లో ఎందుకు ఇలాంటివి అని ఇమ్మూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ చిన్న గొడవ కాస్తా పెద్దదయ్యింది. భరణి అరుపులకు దివ్య ఏడవడం, ఇమ్మూ ఇన్వాల్వ్ అవ్వడంతో… సంజన ఉదయాన్నే ఇలా అవుతుంది అనుకోలేదు అంటూ ట్యాబ్లెట్స్ తెచ్చి ఇచ్చింది.

అందమైన యోధురాలు

అలాగే బిగ్ బాస్ తెలుగు 7లోని మోస్ట్ కాంట్రోవర్సియల్ కంటెస్టెంట్ శోభా శెట్టి ఎంట్రీతో “మంచి మంచి యోధురాళ్లను పంపిస్తున్నారు బిగ్ బాస్” అంటూ ఇమ్మూ థాంక్స్ చెప్పాడు. “చిక్కులు దిక్కులు లెక్కలు” అనే టాస్క్ లో వివిధ నెంబర్ తో ఉన్న తమ కలర్ సిలిండర్లను ఒక్కొకటిగా తీసుకుని, టన్నెల్ ద్వారా పాక్కుంటూ వెళ్ళి, తమ పేరుతో ఉన్న ట్రయాంగిల్ స్లాట్స్ లో పెట్టాలి. ట్రయాంగిల్ పై భాగాన్ని పక్కకు తీస్తే ఓ నంబర్ ఉంటుంది. ట్రయాంగిల్ లో ఉన్న మూడు యాంగిల్ లో ఒక్కో నెంబర్ ను కూడితే అదే టార్గెట్ నెంబర్ రావాలి. ఈ టాస్క్ లో దివ్య, శోభా శెట్టి పాల్గొనగా, దివ్యానే గెలిచింది.

సోహెల్ ఇజ్జత్ తీసిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 4లో బెస్ట్ పర్ఫార్మర్ గా నిలిచిన సోహెల్ తాజాగా మరోసారి సీజన్ 9లో అడుగు పెట్టి ఫుల్ జోష్ తీసుకొచ్చాడు. 6 వారాలు హౌస్ లో చికెన్ తినలేదా? నేనైతే గోడ దూకి పారిపోయేవాడిని అంటూ పంచ్ వేశాడు. అంతేకాకుండా హౌస్ మేట్స్ కోసం కేజీ చికెన్, పాలు, కాఫీ పౌడర్ ను ఇవ్వమని బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశాడు. కానీ వాటి బొమ్మలు మాత్రమే పంపి బిగ్ బాస్ సోహెల్ తో కాసేపు ఆడుకున్నాడు. “ఇజ్జత్ తీస్తున్నావ్ బిగ్ బాస్” అని సోహెల్ ఆవేదన వ్యక్తం చేయడంతో, చివరికి బిగ్ బాస్ చికెన్ తో పాటు పాలు కూడా పంపారు. దీంతో సోహెల్ స్టైల్ లో “చికెన్ చికెన్ మటన్ మటన్” అంటూ గెంతులేశారు హౌస్ మేట్స్.

చివరికి రీతూ, సంజనలతో సోహెల్ ‘100 టైమ్స్ డిఫికల్టీ” అనే టాస్క్ ఆడాడు. ట్రాక్ మీద కింద పడకుండా నడుస్తూ, వాటికి కట్టిన బ్యాగ్స్ ముడివిప్పి, బోర్డు దగ్గర బ్యాగ్స్ ను తీసి, నెంబర్స్ ను 1-100 వరకు బోర్డుపై సరైన క్రమంలో అమర్చాలి. ఈ టాస్క్ లో సంజన, రీతూలనే గెలిపించాడు సోహెల్. లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ల లిస్ట్ లో దివ్య, సంజన, రీతూ , కళ్యాణ్, పవన్, ఇమ్ము ఉన్నారు.

Read Also : దివ్యాకు దండం పెట్టేసిన భరణి… ఇక మారరా వీళ్ళు

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×