Nayanthara:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా అది సినిమా జీవితమైనా.. వ్యక్తిగత జీవితమైనా సరే దావానంలా పాకి పోతుంది అనడంలో సందేహం లేదు. అందుకే సోషల్ మీడియా వాడేటప్పుడు లేదా పబ్లిక్ లో ఉండేటప్పుడు సెలబ్రిటీలు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. లేకపోతే విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు సెలబ్రిటీలు తమ ప్రమేయం లేకపోయినా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి అది వేరే సంగతి.
ఇటు సినిమాల విషయానికి వస్తే.. పాత్రలు డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించాల్సిందే. ఒక్కొక్కసారి పరిమితులను దాటి మరీ నటించిన సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా తాజాగా లేడీ సౌత్ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార కూడా తాజాగా చేస్తున్న పనులను చూస్తే తన రూల్స్ బ్రేక్ చేసిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి తాను నటించే ఏ సినిమా అయినా సరే కొన్ని రూల్స్ పెట్టుకొని.. ఆయా సినిమాలలో నటిస్తూ.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో తాను పెట్టుకున్న సరిహద్దులను చెరిపి వేస్తూ ఒక అడుగు ముందుకు వేస్తోంది.
ట్రెండు ఫాలో అవుతూ చేస్తున్న పాత్రలు కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం ఏకంగా ప్రమోషనల్ వీడియోలు చేసి ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఏకంగా మరో ముందడుగు వేసి స్మోకింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో నయనతార స్మోకింగ్ చేయడం ఏంటి ? అంటూ ఇది చూసిన ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
also read:కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?
నయనతార ఈ మధ్యకాలంలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా అదరగొడుతున్న విషయం తెలిసిందే . ఒకవైపు హోమ్లీగా కనిపిస్తూనే.. మరొకవైపు యాక్షన్స్ తో అదరగొట్టేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం టాక్సిక్. యశ్ హీరోగా నటిస్తూ గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో గంగ అనే ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఆగస్టు 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టాక్సిక్ మూవీ నుండి “మనసాగదే” అంటూ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయగా.. అందులో నయనతార స్మోకింగ్ చేస్తూ కనిపించింది.
ఇంకేముంది నెటిజెన్స్ చాలా తెలివైన వాళ్ళు.. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వాట్ నయనతార చేస్తోంది ఏంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పాత్రలను చాలా జాగ్రత్తగా ఎంచుకునే ఈమె సడన్గా ఇలా మారడం ఏంటి? ఈమె ఏదైనా రూటు మార్చారా? లేదా స్క్రిప్ట్ డిమాండ్ చేసిందా? అని పలువురు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కెరియర్ మొదట్లో పలు బోల్డ్ పాత్రలు చేసిన ఈమె ఆ తర్వాత సాఫ్ట్ క్యారెక్టర్లతో ఎక్కువగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే సడన్గా ఇప్పుడు మళ్ళీ ఇలా కనిపించేసరికి అందరూ సైతం ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు నయనతార విష్ణు ఎడవన్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాయ్ అనే చిత్రంలో నటిస్తోంది . ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.