Rasha Thadani: ఒకప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు బాలీవుడ్ లో నటించాలి అంటే.. అంత త్వరగా అవకాశాలు లభించేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రాంతీయంగా సినిమాలు చేయడం కంటే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడానికి సెలబ్రిటీలు ఆసక్తి కనపరుస్తున్నారు. ముఖ్యంగా మిగతా భాషలతో పోల్చుకుంటే తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో అటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరచడమే కాకుండా తమ వారసులను కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.
అలా ఇప్పటికే సెలబ్రిటీ కిడ్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. ఇప్పుడు మరో బాలీవుడ్ సెలబ్రిటీ కిడ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె ఎవరో కాదు రషా తడానీ. కే జి ఎఫ్ 2 చిత్రంతో సంచలనం సృష్టించిన రవీనా టాండన్ కూతురే ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దివంగత నటుడు రమేష్ కుమార్ వారసుడు జయకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. పైగా ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రషా తడానీ టాలీవుడ్ ఇండస్ట్రీపై అలాగే టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లపై తన తల్లి తనకు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
also read:వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ
తాజాగా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న రషా తడానీకి మీరు తెలుగు ఇండస్ట్రీలోకి వస్తానన్నప్పుడు మీ అమ్మ ఏమి చెప్పలేదా ? అని అడిగితే ..ఆమె మాట్లాడుతూ..” నటనకు సంబంధించి సూచనలు ఏవి కూడా మా అమ్మ ఇవ్వదు. అయితే తెలుగు సినిమా అనగానే అక్కడ షూటింగ్ చాలా సరదాగా సాగుతుంది.. తెలుగు కూడా నేర్చుకోమని సలహా కూడా ఇచ్చింది అంటూ రషా తడానీ స్పష్టం చేసింది.ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇదే ఇంటర్వ్యూలో జయకృష్ణ షూటింగ్ సెట్లో ఎలా ఉంటాడు? అనే విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు. జయకృష్ణ చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ చాలా అల్లరి చేస్తాడు. ముఖ్యంగా షూటింగ్ సమయంలో బోర్డు గేమ్స్ ఆడేవాళ్ళం.. జయకృష్ణ చీటింగ్ చేసేవాడు అంటూ తెలిపింది.. అలాగే షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ.. నాకు తెలుగు భాష పై పట్టు లేకపోవడంతో డైలాగులు చెప్పడానికి మొదట్లో ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత సినిమా టీం సహాయంతో బాగానే చేశాను. అందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక మోహన్ బాబుతో పని చేయడం సరదాగా అనిపించిందని, తన తల్లితో ఆయన నటించిన రోజులను, అనుభవాలను తనతో షేర్ చేసుకునే వారని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రషా తడానీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.