E-Paper
Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నయనతార.. గత 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్ సొంతం చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ అనే పదమే లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే హీరోయిన్గా అవకాశాలు అందుకుందో.. ఇప్పటికీ కూడా అదే రేంజ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలా తాజాగా ఈమె నటించిన మరో చిత్రం హాయ్. నయనతార, యువ నటుడు కవిన్ జంటగా వస్తున్న తాజా చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ విడుదల చేస్తూ రిలీజ్ చేసిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో అంచనాలు పెంచేసింది.

హాయ్ మూవీ రిలీజ్ డేట్ లాక్..

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తుండగా.. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, జి స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జెన్ మార్టిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కథాంశం, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఇదివరకే చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇకపోతే అన్ని పనులు పూర్తి చేసుకొని .. విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా విడుదల తేదీని రిలీజ్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన ఒక చిన్న ప్రోమో సోషల్ మీడియాలో అంచనాలు పెంచేసింది.

రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రోమో విడుదల చేసిన మేకర్స్..

Advertisement

ఈ మేరకు జి స్టూడియోస్ విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రోమో విషయానికి వస్తే.. జోరుగా వర్షం పడుతుండగా.. బస్ స్టాప్ లో చీర కట్టుకొని ఒక చేతిలో సంచి మరొక చేతిలో వేట కొడవలి పట్టుకొని చాలా అమాయకంగా కనిపించింది నయనతార . అదే జోరు వర్షంలో బైక్ పై కవిన్ ఆమె చేతిలో ఉన్న కత్తిని చూస్తూ ఆశ్చర్యంగా కనిపించారు.. ఇక ఆ వర్షంలో వీరిద్దరూ బైక్ లో వెళ్తున్నట్టు ఒక చిన్న ప్రోమో డిజైన్ చేసి రిలీజ్ చేస్తూ.. ” మీ హృదయాన్ని దోచుకునే ఒక కథకు ఇప్పుడు విడుదల తేదీ ఖరారు అయ్యింది”. అంటూ ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న హాయ్..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ అందించినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. మొత్తానికి అయితే సెన్సార్ పూర్తి చేసుకుని ఆగస్టు 14వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న హాయ్ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

also read: చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

నయనతార తదుపరి చిత్రాలు..

నయనతార ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో గంగా అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది . చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే.. అదే సమయంలో ప్రమాదకరమైన వారియర్ అవతార్ లో కూడా కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు హీరోకి సోదరిగా నటిస్తున్నట్లు సమాచారం.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×