E-Paper
Advertisement

El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?

El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?
Advertisement

El Niño: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షభావం, ఎల్‌ నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పాత జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎప్పటికప్పుడు అంచనా..

వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, వర్షపాతం, తాగునీరు, సాగునీటి లభ్యత, వ్యవసాయ రంగంలో తలెత్తే సవాళ్లను ఆయా శాఖలతో సమన్వయం చేయనున్నారు.​ వర్షపాతం నమోదు, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిలను ఎప్పటికప్పుడు అంచనా వేయనున్నారు. ప్రజలకు, పశువులకు తాగునీటి లభ్యత ఇబ్బంది లేకుండా పర్యవేక్షించనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల పరిస్థితిని సమీక్షించి, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా మానిటరింగ్ చేయనున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో..

Advertisement

ఇక వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేలా ఎప్పటికప్పుడు సిస్టమ్ ను రెడీగా ఉంచనున్నారు. ఎల్ నినోపై ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్లానింగ్, వ్యవసాయం, హార్టికల్చర్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఎనర్జీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక శాఖల అధికారులు పాల్గొని సమగ్ర నివేదికలు సమర్పించనున్నారు.

Also Read: Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

జిల్లా – అధికారి

Advertisement

హైదరాబాద్ – జయేష్​ రంజన్
రంగారెడ్డి – వికాస్ రాజ్
కరీంనగర్ – మహేష్​ దత్ ఎక్కా
మెదక్ – వాణి ప్రసాద్
నిజామాబాద్ – యోగితా రాణా
నల్లగొండ – హరిచందన
ఆదిలాబాద్ – ఇలంబర్తి
వరంగల్ – దేవసేనా
మహబూబ్ నగర్ – గౌతమ్
ఖమ్మం – అనుదీప్ దురిశెట్టి

Also read: Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×